E-Paper
Advertisement

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. NTAకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాలు!

విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలొద్దు.. NTAకు సుప్రీంకోర్టు సీరియస్ ఆదేశాలు!
Advertisement

Supreme Court: భారతదేశంలోని లక్షలాది మంది వైద్య విద్యాభ్యర్థుల భవిష్యత్తుకు, వారి తల్లిదండ్రుల ఆశలకు సంబంధించిన ఘటనిది. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వివాదాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీంకోర్టు ఆదేశాలు..

Advertisement

నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలకు ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలాని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి కేంద్రాలకు చేరే వరకు రవాణా వ్యవస్థ ఎంతవరకు భద్రంగా ఉందో వివరించాలని కోరింది. అంతేకాకుండా, పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు రాబోయే రోజుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం కీలక హామీ..

Advertisement

సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తాము సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాల కోసం సాధారణ చర్యల కంటే ‘పది అడుగులు అదనంగా’ వేసి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించింది. రాబోయే పరీక్షల్లో పూర్తి పారదర్శకత, భద్రత ఉండేలా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టమైన హామీ ఇచ్చింది.

Also Read: మానవత్వం చాటుకున్న మంత్రి జూపల్లి.. కాన్వాయ్‌లోనే బాధితుడి తరలింపు!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×