E-Paper
Advertisement

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?

Sonam Bail: హనీమూన్​ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. నిందితురాలికి కోర్టు రెండు ఆప్షన్లు..?
Advertisement

Sonam Bail: స్వేచ్చ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమన్​ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో అరెస్ట్ అయి ప్రస్తుతం బెయిల్​ పై విడుదలైన నిందితురాలికి సుప్రీం కోర్టు రెండు ఆప్షన్లు ఇచ్చింది. మీరు లొంగిపోతారా? లేక మేం వాస్తవ అంశాలను పరిశీలించి ఉత్తర్వులు జారీ చేయాలా? అని ప్రశ్నించింది. మేఘాలయ షిల్లాంగ్‌లో జరిగిన హనీమూన్​ హత్య కేసు దేశం మొత్తం మీద తీవ్ర కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.

పదకొండు నెలలు జైల్లో..

గత ఏడాది భార్యాభర్తలైన సోనమ్, రఘువంశీలు హనీమూన్​ కోసం షిల్లాంగ్​ వెళ్లారు. అక్కడ రఘువంశీ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పోలీసులు సోనమ్​ తోపాటు మరికొందరిని అరెస్ట్​ చేశారు. పదకొండు నెలలపాటు జైల్లో ఉన్న సోనమ్​ కు షిల్లాంగ్​ కోర్టు ఏప్రిల్ లో బెయిల్​ మంజూరు చేసింది. దాంతో ఆమె జైలు నుంచి విడుదలై బయటకు వచ్చింది. దీనిని మేఘాలయ ప్రభుత్వం ఆ రాష్ట్ర హైకోర్టులో సవాల్​ చేసింది. అయితే, హైకోర్టు కింది కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. దాంతో మేఘాలయ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేసింది.

Advertisement

Also read; TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

లొంగి పోయిన సోనమ్..

కేసు విచారణ కీలక దశలో ఉందని.. సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్న సమయంలో నిందితురాలికి బెయిల్ ఇవ్వటం దర్యాప్తుపై ప్రభావం చూపించే సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహత వాదనలు వినిపించారు. రఘువంశీ హత్య కేసులో సోనమ స్వచ్ఛంధంగా పోలీసుల ఎదుట లొంగిపోయారని చెప్పారు. ఈ నేపథ్యంలో అరెస్టుకు కారణాలను వెల్లడించ లేదని ఆమె తన అరెస్టును సవాల్​ చేయలేరని చెప్పారు. సోనమ్​ తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ బెయిల్ ఇచ్చే ముందు ట్రయల్​ కోర్టు షిల్లాంగ్​ లోనే ఉంటూ ప్రతిరోజూ విచారణకు హాజరు కావాలన్న కఠినమైన షరతును పెట్టినట్టు చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో సోనమ్​ కేసు విచారణపై ఎలా ప్రభావం చూపగలదన్నారు.

విచారణ వాయిదా..

Advertisement

ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు ధర్మాసనం తాము కేసులోని ఇరుపక్షాల పట్ల సమ న్యాయంగా వ్యవహరిచాలని భావిస్తున్నట్టు పేర్కొంది. కేసులోని కీలక సాక్షుల వాంగ్మూలాలను ట్రయల్​ కోర్టు నమోదు చేస్తున్న సమయంలో సోనమ్​ లొంగిపోవాలని సూచించింది. ప్రస్తుతం మా ముందు రెండు మార్గాలున్నాయంటూ ఒకటి కేసులోని వాస్తవ అంశాలను పరిగణలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేయటం లేదా సాక్షుల విచారణ ముగిసే వరకు సోనమ్​ లొంగిపోవాలని ఆదేశించటం అని పేర్కొంది. తదుపరి విచారణను వాయిదా వేసింది.

Also Read: Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×