E-Paper
Advertisement

Adani: అదానీ కేసులో సుప్రీంకోర్టు ట్విస్ట్.. మోదీకి షాక్ తప్పదా?

Adani: అదానీ కేసులో సుప్రీంకోర్టు ట్విస్ట్.. మోదీకి షాక్ తప్పదా?
Advertisement

Adani: అదానీ-హిండెన్‌బర్గ్‌ ఎపిసోడ్ దేశాన్ని కుదిపేస్తోంది. స్టాక్ మార్కెట్లను షేక్ చేస్తోంది. 10 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. ప్రపంచ వీధుల్లో దేశం పరవు పోయింది. ఎంత డ్యామేజ్ చేయాలో.. అంతకంటే ఎక్కువే నష్టం చేకూర్చింది అదానీ యవ్వారం. అదానీకి మోదీ సపోర్ట్ ఉందని.. కేంద్రం దన్ను వల్లే అదానీ ఇంతటి అరాచకాలు చేయగలిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ విషయంలో న్యాయం చేయాలంటూ కొందరు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీం త్రిసభ్య ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

అదానీ-హిండెన్‌బర్గ్‌ అంశంపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ విషయంలో నిజానిజాలు తేల్చేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది.

Advertisement

ఇటు పిటిషనర్ల నుంచి కానీ, అటు ప్రభుత్వం నుంచి కానీ ఎవరి పేర్లను, సూచనలు, సలహాలు తీసుకోబోమని స్పష్టం చేసింది.

కేంద్రం ఇచ్చిన సీల్డ్‌ కవర్‌ సూచనలను అంగీకరించబోమని సుప్రీంకోర్టు వెల్లడించింది. పూర్తి పారదర్శకత ఉండాలని కోరుకుంటున్నామని తెలిపింది.

Advertisement

అదానీ వ్యవహారంపై దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణను ముగించి తీర్పును రిజర్వ్‌ చేసిన ధర్మాసనం.. తామే ఒక నిపుణుల కమిటీని నియమిస్తామని ప్రకటించింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×