E-Paper
Advertisement

Supreme Court: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు

Supreme Court: అరుదైన కేసుల్లోనే బెయిల్‌ ఆర్డర్‌పై స్టే ఇవ్వాలి: సుప్రీంకోర్టు
Advertisement

Supreme Court Orders to High Court: సుప్రీంకోర్టు ఓ కేసు విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టులు బెయిల్ ఉత్తర్వలపై స్టే విధించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తొసిపుచ్చుతూ జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్ ల బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

మనీలాండరింగ్ కేసులో నిందితుడికి బెయిల్ మంజూరు చేసేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. అయితే నిందితుడికి ఇచ్చిన స్వేచ్చలో కోర్టులు జోక్యం చేసుకోలేవని సుప్రీంకోర్టు పేర్కొంది. బెయిల్ పై స్టే విధించే హక్కు కోర్టుకు ఉన్నా..ఇది అరుదైన, అసాధాారణ పరిస్థితుల్లో మాత్రమే చేయాలంటూ స్పష్టం చేసింది.

Advertisement

మనీ లాండరింగ్ కేసులో పర్వీందర్ సింగ్ ఖురానాకు ట్రయట్ కోర్టు గతేడాది జూన్ 17న బెయిల్ ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన బెయిల్ ను ఢిల్లీ హైకోర్టు జూన్ 7న తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే ఈ కేసుపై పర్వీందర్ సింగ్ ఖురానా సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

తాజాగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను విచారించింది. ఇందులో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను పక్కనపెట్టి మళ్లీ పర్వీందర్ సింగ్ ఖురానా బెయిల్ ను పునరుద్దరించింది. బెయిల్ మంజూరు ఉత్తర్వులను అరుదైన కేసుల్లో మాత్రమే కోర్టు నిలిపివేస్తుందని, బలమైన కారణాలు ఉంటే తప్పా బెయిల్ రద్దు కుదరదని తేల్చి చెప్పింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×