// //

Supreme Court : దేశ సర్వోన్నత న్యాయస్థానానికి చలికాలం సెలవులు ప్రకటించారు. జనవరి 1 వరకూ సెలవులు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ప్రకటించారు. సెలవుల సమయంలో సుప్రీంకోర్టులో ఏ విధమైన బెంచ్‌లు అందుబాటులో ఉండవన్నారు. ప్రతియేటా శీతాకాల సెలవుల్లో వెకేషన్ బెంచ్‌లు ఏర్పాటయ్యేవి కానీ ఈసారి ఏ బెంచ్‌లు అందుబాటులో ఉండవని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు.
2023 జనవరి 2న తిరిగి సుప్రీంకోర్టు సేవలు ప్రారంభమౌతాయి. కోర్టుల సెలవులపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో వ్యాఖ్యలు చేసిన తరువాతి రోజే సుప్రీంకోర్టు సీజేఐ సెలవులు ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. న్యాయస్థానాలకు సెలవుల అంశమనేది గతంలో కూడా చాలాసార్లు చర్చనీయాంశమైంది.