E-Paper
Advertisement

Pakistan : పాకిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. 93 మంది మృత్యువాత..

Pakistan : పాకిస్థాన్‌ లో ఆత్మాహుతి దాడి.. 93 మంది మృత్యువాత..
Advertisement

Pakistan : పాకిస్థాన్‌ లో మరోసారి ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పెషావర్‌ లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 93 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా శిథిలాల నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. బాధితులను వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

పెషావర్‌లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పోలీస్‌ లైన్స్‌లోని ఓ మసీదులో సోమవారం ఆత్మాహుతి దాడి జరిగింది. భద్రతా సిబ్బంది లక్ష్యంగా ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 20 మంది పోలీసు అధికారులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Advertisement

ఆత్మహుతి దాడి ఘటనపై పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌ మండిపడ్డారు. పాకిస్థాన్ పరిరక్షణ కోసం పాటుపడుతున్న వారిని లక్ష్యంగా చేసుకొని, ఉగ్రవాదులు భయాన్నిసృష్టించాలని అనుకుంటున్నారని విమర్శించారు.

సోమవారం యునైటెడ్ అరబ్‌ ఎమిరేట్స్‌ అధ్యక్షుడు పాకిస్థాన్‌లో పర్యటించాల్సి ఉంది. ఆ సమయంలోనే ఈ ఉగ్రదాడి జరిగింది. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఆ పర్యటన కాస్తా రద్దయింది. అలాగే పాకిస్థాన్ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రతినిధులకు ఆతిథ్యం ఇవ్వనుంది. మరోవైపు దేశంలో ఇలాంటి ఉగ్రదాడులు జరగడంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×