E-Paper
Advertisement

అధికారం ముఖ్యం కాదు.. సిద్ధాంతం, విలువలే ప్రాణం, దళపతి వెనుక ఎంకే స్టాలిన్ వ్యూహం

అధికారం ముఖ్యం కాదు.. సిద్ధాంతం, విలువలే ప్రాణం, దళపతి వెనుక ఎంకే స్టాలిన్ వ్యూహం
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) అనూహ్య విజయాలను సాధించింది. ఈ విజయం వెనుక అధికార డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ వ్యూహాత్మక సహకారం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కొత్తగా పార్టీ పెట్టిన విజయ్ 108 స్థానాలను కైవసం చేసుకోవడం వెనుక స్టాలిన్ తీసుకున్న నిర్ణయాలు కీలకంగా మారాయి. గతంలో తన తండ్రి కరుణానిధి పాటించిన రాజకీయ విలువలను స్టాలిన్ ఇప్పుడు ఆచరించి చూపారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని సొంత పార్టీ నేతలు ఎంత ఒత్తిడి తెచ్చినా ఆయన ఏమాత్రం ఒప్పుకోలేదు. బలం లేకపోయినా ఒక ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారంలోకి రావడం ద్రావిడ సిద్ధాంతాలకు విరుద్ధమని ఆయన గట్టిగా నమ్మారు.

విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు తొలుత విముఖత చూపిన లెఫ్ట్ పార్టీలు.. వీసీకే నేతలను స్టాలిన్ స్వయంగా ఒప్పించారు. ప్రజాస్వామ్యంలో కొత్త నాయకత్వానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ అడుగు వేశారు. తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ హెచ్చరించినప్పటికీ ఆయన వెనక్కి తగ్గలేదు. విజయ్ ముఖ్యమంత్రి అయితే భవిష్యత్తులో డీఎంకేకు నష్టం జరుగుతుందని ఉదయనిధి వారించినా.. స్టాలిన్ తన నిర్ణయానికే కట్టుబడ్డారు. నిజానికి స్టాలిన్ కనుసైగ చేస్తే ఏ ఇతర పార్టీ కూడా విజయ్ వైపు వెళ్లే ధైర్యం చేసేది కాదు. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ తనను తీవ్రంగా విమర్శించినా ఆ వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజాస్వామ్య విలువలకే స్టాలిన్ పెద్దపీట వేశారు.

Advertisement

జయలలిత మరణానంతరం కూడా కేవలం పది మంది ఎమ్మెల్యేలను చేర్చుకుంటే డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. అప్పట్లో కరుణానిధి అలాంటి అనైతిక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు స్టాలిన్ కూడా అదే బాటలో పయనిస్తూ విజయ్ విజయానికి పరోక్షంగా బాటలు వేశారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పాలనాపరమైన ప్రతిష్టంభన ఏర్పడకుండా ఆయన హుందాగా వ్యవహరిస్తున్నారు. తాజాగా స్టాలిన్ చేసిన ట్వీట్ దీనిని స్పష్టం చేస్తోంది. గవర్నర్ వెంటనే స్పందించి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ప్రజాస్వామ్య బాధ్యతను గుర్తు చేస్తూ కొత్త ప్రభుత్వం ఏర్పాటులో జాప్యం జరగకూడదని స్టాలిన్ పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం.. రాష్ట్ర సంక్షేమం కోసం పాలన సాగించడం అత్యంత ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వైషమ్యాలను పక్కనపెట్టి తమిళనాడు ప్రయోజనాల కోసం ఆయన తీసుకున్న ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. శత్రువునైనా గౌరవించే ద్రావిడ సంస్కృతిని స్టాలిన్ చాటిచెప్పారు. విజయ్ సీఎంగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమం చేస్తూ డీఎంకే తరపున పూర్తి మద్దతును ప్రకటించారు.

Advertisement

ALSO READ: గవర్నర్ విజయ్ కు అవకాశం ఇవ్వకపోవడానికి అదే కారణమా..కస్తూరి శంకర్ కామెంట్స్ వైరల్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×