E-Paper
Advertisement

SSC CHSL 2024: 3,712 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి!

SSC CHSL 2024: 3,712 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. ఇలా అప్లై చేసుకోండి!
Advertisement
SSC CHSL
SSC CHSL

SSC CHSL 2024 Notification Out for 3712 Vacancies: నిరుద్యోగులకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల గుడ్ న్యూస్ చెప్పిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో వివిధ ఖాళీల భర్తీకి CHSL -2024 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,712 ఖాళీలను భర్తీ చేయనుంది. అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో), డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌-ఏ), లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి. కాగా ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ రీసెంట్‌గా ప్రారంభమైంది. దీనికి సంబందించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

విద్యార్హత: 01.08.2024 నాటికి ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా చదివినవారు కూడా అర్హులే. అయితే డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌లో సైన్స్‌ గ్రూప్‌తో మ్యాథ్స్‌ ఒక సబ్జెక్టుగా ఉండాలి.

Advertisement

వయోపరిమితి: 01.08.2024 నాటికి 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, దివ్యాంగులకు 10-15 ఏళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 ఏళ్ల వరకు మినహాయింపు ఉంటుంది.

Also Read: ఈ ఆకుకూర తింటే.. ఎప్పటికి కుర్రాళ్లే!

Advertisement

దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజును రూ.100గా నిర్ణయించారు. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు 3 ఏళ్లు మినహాయింపు వర్తిస్తుంది. డిఫెన్స్ పర్సనల్స్ అభ్యర్థులకు మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపిక విధానం: టైర్‌-1, టైర్‌-2 ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. అనంతరం ఈ రెండు పరీక్షల మార్కుల ఆధారంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులకు వారు అప్లై చేసుకున్న పోస్టును బట్టి మూడో దశలో కంప్యూటర్‌ టెస్ట్‌ లేదా టైపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ఇక్కడ గమనించాల్సిందే ఏంటంటే.. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్‌, మెడికల్ టెస్ట్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

ఏప్రిల్ 8వ తేదీని ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అయింది.

మే 7 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది.

మే 8 ఆన్‌లైన్ ఫీజు చెల్లింపులకు చివరి తేదీ.

Also Read: మండుతున్న ఎండలు.. ఈ చిట్కాలు తప్పనిసరి!

టైర్‌-1 టెస్ట్.. జూన్-జులై, 2024న నిర్వహిస్తారు.

టైర్‌-2 డిస్క్రిప్టివ్‌ ఎగ్జామ్.. తర్వాత ప్రకటించనున్నారు.

నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెబ్‌సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×