E-Paper
Advertisement

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,

వాతావరణ శాఖ చల్లటి కబురు.. మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ,
Advertisement

Weather News: ఎండలతో అల్లాడిపోతున్న సామాన్యులకు చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. మరో రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇవ్వనున్నాయి. అందుకు వాతావరణం పూర్తి అనుకూలంగా ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ

Advertisement

ఎండలతో సామాన్యుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోయాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నా, మరుసటి రోజు మళ్లీ ఎండలు తమ ప్రతాపం చూపుతున్నాయి. సాయంత్రం అయితే చాలు కాస్త చినుకులు రాలితే హాయిగా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పేసింది.

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ దీవులకు చేరుతాయని చెప్పింది. నైరుతి రుతుపవనాలకు వాతావరణం అనుకూలంగా పేర్కొంది. కేరళకు మే రెండోవారం చివరినాటికి రుతుపవనాలు రావచ్చని వెల్లడించింది. తుఫాను వలయం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల వరకు విస్తరించిందని, రాబోయే 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

Advertisement

మరో రెండురోజుల్లో నైరుతి రుతుపవనాలు ఎంట్రీ

2026 మే 16 నాటికి అండమాన్ & నికోబార్ దీవులకు చేరుకుంటాయని అంచనా వేసింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. మే 14న అంటే గురువారం జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎత్తైన ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో ఈదురు గాలుల ప్రభావం అధికంగా ఉండనుంది.

మే 13-19వరకు అండమాన్ & నికోబార్ దీవుల్లో ఉరుములు-మెరుపులతో గాలులతో కూడిన తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంగానది పరివాహక ప్రాంతంలో మే 14 తర్వాత వాతావరణ పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది.

ALSO READ: వ్యూహం ఫలించింది.. 15వ నౌక సేఫ్.. భారత్‌కు ఇక ఇంధన కష్టాలు తీరినట్టే?

మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. బీహార్, జార్ఖండ్‌ల్లో ఉరుములతో కూడిన వర్షం పడనున్నట్లు తెలిపింది. మే 14న జార్ఖండ్‌, మే 16న బీహార్‌లో గాలి వేగం గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపింది. ముందస్తు మార్పు రుతుపవనాల ప్రారంభానికి సంకేతం అయినప్పటికీ, మే నెల మధ్య వరకు ఈశాన్య భారత్.. దక్షిణ ప్రాంతంలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×