E-Paper
Advertisement

Southwest Monsoon Entered into Kerala : కేరళను తాకిన నైరుతి.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

Southwest Monsoon Entered into Kerala : కేరళను తాకిన నైరుతి.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Advertisement

Southwest Monsoon Entered into Kerala : దేశ ప్రజలకు, రైతులకు వాతావరణ శాఖ కూల్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు గురువారం ఉదయం కేరళను తాకినట్లు భారత వాతావరణ విభాగం వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని పేర్కొంది. మరో 3-4 రోజుల్లో రుతుపవనాలు ఏపీని తాకే అవకాశాలున్నట్లు తెలిపింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఐఎండీ చెప్పిన కబురుతో తెలుగు రాష్ట్రాల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు.

నైరుతి రాకతో కేరళ, ఈశాన్య రాష్ట్రాలను ఐఎండీ అలర్ట్ చేసింది. సముద్రతీర ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి రాకముందు నుంచే కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొట్టాయం, ఎర్నాకుళం జిల్లాల్లో రెడ్ అలర్ట్, మరో 3 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. ఐఎండీ అంచనా ప్రకారం జూన్ 5 నాటికి రుతుపవనాలు కర్ణాటక, ఏపీ, అస్సాంలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. జూన్ 10వ తేదీ నాటికల్లా తెలంగాణతోపాటు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ ను రుతుపవనాలు తాకనున్నాయి. గురు, శుక్రవారాల్లో తెలంగాణలో వాతావరణం పొడిగా ఉంటుందని తెలిపింది. కేరళలో 5 రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Advertisement

ఇదిలా ఉండగా.. యూపీలో ఎండలు బెంబేలెత్తిస్తున్నాయి. బుధవారం అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల కారణంగా 31 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మహోబాలో 8 మంది, హమీర్ పూర్ లో 7గురు, చిత్రకూట్ లో ఆరుగురు, ఫతేపూర్ లో ఐదుగురు, బందాలో ముగ్గురు, జలౌన్ లో ఇద్దరు మరణించినట్లు వివరించారు. ప్రయాగ్ రాజ్ లో గరిష్టంగా 48.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×