E-Paper
Advertisement

Sitaram yechury: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి

Sitaram yechury: నిమోనియా.. ఎయిమ్స్‌లో చేరిన సీపీఎం కార్యదర్శి సీతారం ఏచూరి
Advertisement

Sitaram yechury: భారత కమ్యూనిస్టు పార్టీ నేత, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంలో ఆయన సోమవారం ఢిల్లీ ఎయిమ్స్‌లో జాయిన్ అయ్యారు. సీతారాం ఆరోగ్యం రీత్యా అత్యవసర విభాగంలో చేర్చినట్టు సీపీఎం వర్గాలు వెల్లడించాయి.

వైద్య పరీక్షల కోసం ఆయన ఇటీవల ఎయిమ్స్‌కి వెళ్లారు. నిమోనియా ఉందని తేలడంతో అక్కడే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఏచూరి ఆరోగ్యం నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల ఏచూరి కంటి ఆపరేషన్ చేయించుకున్నారు.

Advertisement

2021లో ఏచూరి సీతారాం పెద్ద కొడుకు ఆశిష్ కరోనాతో మరణించిన విషయం తెల్సిందే. రెండువారాల పాటు కరోనాతో పోరాడిన ఆయన, ట్రీట్‌మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆశిష్ మరణం సీతారాం మానసికంగా కుంగదీసిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సీతారాం ఏచూరి గురించి తెలియనివారు ఉండరు. ఎనిమిదేళ్ల కిందట బెస్ట్ పార్లమెంటేరియన్‌గా అవార్డు సొంతం చేసుకున్నారు.

ALSO READ: ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం భద్రత పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు..

Advertisement

బ్రహ్మణ కుటుంబానికి చెందిన ఏచూరి సీతారాం.. స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో జాయిన్ అయ్యారు. 1975లో ఢిల్లీ జేఎన్‌యులో స్టూడెంట్‌గా ఉన్నప్పుడు ఎమర్జెన్సీ సమయంలో అరెస్టయ్యారు. 1977-78 మధ్యకాలంలో మూడుసార్లు జేఎన్‌యు స్టూడెంట్స్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికైన విషయం తెల్సిందే. మరుసటి ఏడాది సీపీఎంలో సభ్యుడిగా చేరారు ఏచూరి సీతారాం. లెఫ్ట్ పార్టీలకు జేఎన్‌యును బలమైన వేదికగా మార్చడంలో సీతారం ఏచూరి, బృందాకారత్ కీలక పాత్ర పోషించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×