E-Paper
Advertisement

పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!

పశ్చాత్తాపం లేదు.. పైగా వికృత చేష్టలు.. సియా వీడియో నెట్టింట వైరల్!
Advertisement

Sia Goyal: కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను ప్రియుడితో కలిసి హత్య చేసిన సియా గోయల్ లో ఏ మాత్రం పశ్చాత్తాపం లేనట్లు కనిపిస్తోంది. విచారణ నిమిత్తం పూణె మార్కెట్ యార్డ్ లోని నివాసానికి ఆమెను తీసుకెళ్లగా.. బయటకు వస్తూ సియా ఇచ్చిన సిగ్నల్స్ ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీశాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో సియా.. ఓ మీడియాకు మిడిల్ ఫింగర్ ను చూపించడం వివాదస్పదమవుతోంది.

వైరల్ అవుతున్న 17 సెకన్ల వీడియోలో.. సియా గోయల్ తన నివాసం నుంచి బయటకు వస్తూ కనిపించింది. నల్లటి టీషర్ట్, ముఖాన్ని స్కార్ప్ తో ఉన్న ఆమె విజువల్స్ చిత్రీకరించేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. దూరం నుంచి ఫుటేజీని రికార్డ్ చేస్తున్న క్రమంలో వారిని గమనించిన సియా.. మిడిల్ ఫింగర్ ను చూపిస్తూ తీవ్ర అభ్యంతరకంగా ప్రవర్తించింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Advertisement

ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇంతటి ఘోరమైన హత్య కేసులో నిందితురాలిగా ఉండి కూడా ఈమెకు ఇంత పొగరా? అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ‘చట్టం అంటే అస్సలు భయం లేనట్లు ప్రవర్తిస్తోంది’ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఆమెకు కోర్టులో కఠినమైన శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Also Read: థాయ్‌లాండ్‌లో ఘోర ప్రమాదం.. 11 ఏళ్ల బాలుడి చేతిలో స్టీరింగ్.. 9 మంది సాధువుల దుర్మరణం!

జూన్ 18న మహారాష్ట్ర పుణేలోని లోహగఢ్ కోట పైనుంచి కేతన్ అగర్వాల్ ను సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి కిందరికి తోసి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. తొలుత సియా ఫొటో తీస్తుండగా.. హోరుగాలి వీచి ప్రమాదవశాత్తు కిందపడిపోయినట్లు పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే కేతన్ మృతిపై సియాలో ఎలాంటి విచారం లేకపోవడంతో అనుమానించి.. అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు గుట్టుబయట పడి.. సియాతో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ చేతన్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.

Also Read: Illu Illalu Pillalu Today Episodes: వల్లికి షాకివ్వబోతున్న నర్మదా.. ప్రేమ పరిస్థితి దారుణం..  ధీరజ్ దెబ్బకు రాజాపుష్పంకు ఫ్యూజుల్ అవుట్..

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×