E-Paper
Advertisement

Indigo Flights: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు..

Indigo Flights: ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు షోకాజ్ నోటీసులు..
Advertisement

Indigo Flights: ఇండిగో విమానయాన సంస్థ ఇటీవల ఎదుర్కొన్న పైలట్ల సంక్షోభం, విమానాల రద్దు వ్యవహారం తీవ్ర సంచలనం సృష్టించడమే కాకుండా, పలు ప్రశ్నలకు దారితీసింది. సాధారణ నిర్లక్ష్యమా లేక దీని వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా, పద్దెనిమిది నెలల క్రితం డీజీసీఏ అదనపు పైలట్ల నియామకాలపై ఆదేశాలు జారీ చేసినా, ఇండిగో ఇప్పటికీ ఆ ఆదేశాలను ఎందుకు పట్టించుకోలేదు?

ఎయిరిండియా, విస్తారా, అకాసా ఎయిర్, స్పైస్‌జెట్ వంటి ఇతర ప్రధాన విమానయాన సంస్థలు పైలట్ల నియామకాలను చేపట్టినప్పటికీ, కేవలం ఇండిగో మాత్రమే ఇంతటి తీవ్రమైన నిర్లక్ష్యం వహించడానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ వ్యవహారం మొత్తం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో ఉన్న సమయంలో జరగడం వెనుక ఏదైనా అంతర్జాతీయ రాజకీయ కోణం ఉందా అనే చర్చ కూడా నడుస్తోంది. అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీయడంలో భాగంగానే ఇదంతా జరిగిందా అన్న అనుమానం తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకున్న పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ), ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Advertisement

ఈ సంక్షోభంపై ఇండిగో సంస్థ అధికారికంగా స్పందిస్తూ, నెట్‌వర్క్‌లో తలెత్తిన అంతరాయాలను పరిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. నిన్నటి రోజున నెట్‌వర్క్ అంతరాయాలను అదుపు చేస్తూ 113 గమ్యస్థానాలకు 700 కంటే ఎక్కువ విమానాలను నడిపినట్లు సంస్థ పేర్కొంది. ప్రయాణికులకు జరిగిన అసౌకర్యానికి ఇండిగో మరోమారు క్షమాపణలు కోరింది.

తాజా పరిస్థితిని వివరిస్తూ, ప్రస్తుతం తమ నెట్‌వర్క్‌ను ‘రీబూట్’ చేయడమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఇండిగో స్పష్టం చేసింది. ఈరోజు 1500 కంటే ఎక్కువ విమానాలను నడపనున్నట్లు ప్రకటించింది. దాదాపు 95 శాతంపైగా నెట్‌వర్క్‌ను రీసెట్ చేసినట్లు విమానయాన సంస్థ తెలిపింది. ఈ లెక్కల ప్రకారం చూస్తే, ఇండిగో తన మొత్తం 138 గమ్యస్థానాలకు గానూ 135 ఆపరేట్ చేయగలమని తేల్చి చెప్పింది. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

ఇండిగో తమ కస్టమర్ల నమ్మకాన్ని తిరిగి నిర్మించడానికి కట్టుబడి ఉన్నామని తెలియజేసింది. ఈ కష్టకాలంలో తమకు సహాయం అందిస్తున్న ప్రభుత్వ సంస్థల నుంచి, ఇతర భాగస్వాముల నుంచి నిరంతర మద్దతు కోరుకుంటున్నట్లు సంస్థ ప్రకటించింది.

Also Read: కేంద్రమంత్రివి అయ్యుండి రాష్ట్రానికి ఏమి చేశావ్.. కిషన్ రెడ్డిపై మండిపడ్డ మహేష్ కుమార్

సంక్షోభ సమయంలో తమ కస్టమర్‌లు, సిబ్బంది చూపిన సహనానికి ఇండిగో హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసింది. విమానాల రద్దు లేదా ఆలస్యం కారణంగా ఇబ్బంది పడిన ప్రయాణికులకు తగిన విధంగా నష్టపరిహారం అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కూడా సమాచారం.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×