E-Paper
Advertisement

Doctor Attack: గౌరవంగా మాట్లాడమన్నందుకు.. పేషెంట్ పై వైద్యుడు దాడి.. వీడియో వైరల్

Doctor Attack: గౌరవంగా మాట్లాడమన్నందుకు.. పేషెంట్ పై వైద్యుడు దాడి.. వీడియో వైరల్
Advertisement

Doctor Attack: పేషెంట్‌పై డాక్టర్ దాడి చేసిన ఘటన హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో ఆదివారం చోటుచేసుకుంది. సిమ్లా జిల్లా కుప్వీ సబ్ డివిజన్‌ నుంచి బ్రీతింగ్ ప్రాబ్లమ్‌తో హాస్పిటల్‌కు వచ్చిన తనను అవమానించేలా డాక్టర్ కామెంట్స్ చేశారని పేషెంట్ ఆరోపించారు. గౌరవంగా మాట్లాడాలని కోరగా దాడికి దిగారని పేషెంట్ ఆరోపించారు.

ఆదివారం సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (IGMC)లో ఒక రోగిపై డాక్టర్ దాడి చేశారని వీడియో వైరల్ అవుతోంది. ఆసుపత్రిలోనే రోగుల ముందే డాక్టర్, పేషెంట్ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది.

Advertisement

గౌరవంగా మాట్లాడమన్నందుకు

సిమ్లా జిల్లాలోని కుప్వీ సబ్ డివిజన్‌లోని ఒక గ్రామానికి చెందిన పేషెంట్, బ్రీతింగ్ తీసుకోవడంలో ఇబ్బందితో ఆసుపత్రికి వచ్చారు. చెకింగ్ కు వచ్చిన డాక్టర్ తనతో దురుసుగా మాట్లాడారని రోగి ఆరోపించారు. గౌరవంగా మాట్లాడమని చెప్పినందుకు, అతను కొట్టడం మొదలుపెట్టాడని రోగి చెబుతున్నారు. ఈ సంఘటన తర్వాత, రోగి బంధువులు ఆసుపత్రి బయట ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడిన వైద్యుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

ఈ సంఘటనకు సంబంధించి ఆసుపత్రి అధికారులు ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియాలో రోగిపై వైద్యుడు దాడికి పాల్పడిన వీడియో వైరల్ అవుతోంది. వైద్యుడిని ఆపేందుకు కొందరు ప్రయత్నిస్తున్నట్లు అందులో కనిపిస్తుంది. ఆసుపత్రి బెడ్ పై ఉన్న రోగిపై డాక్టర్ దాడి చేసిన దృశ్యాలు అందులో ఉన్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×