E-Paper
Advertisement

Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. రాకీ భాయ్ బెదిరింపు..

Salman Khan : సల్మాన్ ను చంపేస్తాం.. రాకీ భాయ్ బెదిరింపు..
Advertisement

Salman Khan (Bollywood News) : సెలబ్రిటీలను చంపేస్తామని బెదిరించడం ఫ్యాషన్ గా మారిపోయింది. గతంలో చాలా మంది బాలీవుడ్ హీరోలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. అలాగే విమానంలో బాంబు ఉంది. రైలులో పేలుడు పదార్థాలున్నాయి అంటూ ఆగంతకులు పోలీసులకు ఫోన్ చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో పెరిగిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో అత్యవసరంగా విమానాలను ల్యాండింగ్ చేసి తనఖీలు చేపడుతున్నారు. రైళ్లను నిలిపివేసి పోలీసులు పరిశీలిస్తున్నారు.

తాజాగా బాలీవుడ్‌ స్టార్ హీరో సల్మాన్‌ ఖాన్‌కు బెదిరింపులు వచ్చాయి. సోమవారం రాత్రి ఓ వ్యక్తి ముంబై పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేశాడు. సల్మాన్‌ను చంపేస్తామని బెదిరించాడు. సోమవారం రాత్రి 9 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేసి సల్మాన్‌ను ఏప్రిల్ 30లోపు చంపేస్తామని బెదిరించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఫోన్‌ ఎక్కడ నుంచి వచ్చింది..? ఎవరు చేశారు? అనే విషయాలపై దర్యాప్తు చేపట్టారు.. రాకీ భాయ్‌ పేరుతో దుండగుడు ఫోన్‌ చేసినట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

సల్మాన్‌ కు నెలరోజుల వ్యవధిలో రెండోసారి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. మార్చి 18న గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపులు వచ్చాయి. ఈ విషయంపై ముంబై బాంద్రా పోలీసులకు సల్మాన్ టీమ్ ఫిర్యాదు చేసింది. ఇలా వరుసగా బెదిరింపులు రావడంతో ముంబై పోలీసులు సల్మాన్ భద్రతపై మరింత దృష్టి పెట్టారు. ప్రస్తుతం సల్మాన్‌ ‘కిసీ కా భాయ్‌ కిసీ కీ జాన్‌’లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ కూడా విడుదలైంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×