E-Paper
Advertisement

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద కాల్పులు.. కస్టడీలో ఉన్న నిందితుడు సూసైడ్
Advertisement

Salman khan house fire news(Today latest news telugu): బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దాడిపై ముంబై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేసున్నారు. ఇందులో భాగంగా కొంతమంది నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే వారిలో ఓ వ్యక్తి పోలీస్ కస్టడీలో ఉండి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.

సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు జరిపిన కేసులో పోలీసులు కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ముంబై పోలీసుల కస్టడీలో ఉన్న అనుమానితుల్లో ఒకరైన అనూజ్ తపన్ అనే 32 ఏళ్ల వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అనూజ్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్థారించారు. అయితే మృతుడు అనూజ్ తపన్ ది పంజాబ్ అని.. ఏప్రిల్ 16న ఈ కేసులో భాగంగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

గత నెల 14న ముంబైలోని బాంద్రా ఏరియాలోని సల్మాన్ ఖాన్ ఉండే గెలాక్సీ అపార్టుమెంట్ దగ్గర ఇద్దరు దుండగులు బైక్ పై వచ్చి కాల్పులు జరిపారు. మూడు రౌండ్లు కాల్పులు జరిపిన అనంతరం అక్కడ నుంచి పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Also Read: ఢిల్లీలో తీవ్ర కలకలం.. 50 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్

సీసీటీవీల ఆధారంగా గుజరాత్ లో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో విక్కీ గుప్తా, సాగర్ పాల్ లు కాల్పులు జరిపిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. అయితే వీరికి ఆయుధాలను సరఫరా చేశారన్న ఆరోపణలతో అనూజ్ తపన్, సోను సుభాశ్ చందర్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×