E-Paper
Advertisement

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం

ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద.. రూ. 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం
Advertisement

Kolkata: ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్ ఎప్పటి నుంచి సంపద బోగేస్తున్నాడో తెలీదు. ఒకటి రెండు కాదు. ఏకంగా కోట్లాది రూపాయలు, 15 కేజీల బంగారం చూసి సంపదను చూసి అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. కేవలం ఇవి కంటికి కనిపించేవి మాత్రమే. కనిపించకుండా ఇంకా ఎన్ని ఉన్నాయో అన్నది అసలు ప్రశ్న. అసలేం జరిగింది?

మాజీ డ్రైవర్‌ ఇంట్లో కోట్ల సంపద- పశ్చిమ బెంగాల్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది ప్రభుత్వ బస్సు మాజీ డ్రైవర్ వ్యవహారం. బెంగాల్ అంతటా ఇప్పుడు ఆ డ్రైవర్ నుంచి చర్చించుకుంటున్నాడు. ఆర్టీసీ డ్రైవర్ నుంచి ఆయన వ్యాపారవేత్తగా ఎలా మారాడు? అన్నది ప్రశ్న. బీర్‌భూమ్‌ జిల్లాకు చెందిన మీనా మండల్‌ నివాసంలో మంగళవారం రాత్రి పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఇంట్లోని రెండు అంతస్తుల నుండి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారు కడ్డీలు బయటపడ్డాయి. కరెన్సీ లెక్కింపు యంత్రాలు ఉపయోగించారు అధికారులు. బుధవారం సాయంత్రం వరకు స్వాధీనం చేసుకున్న సొమ్మును ఇంకా లెక్కిస్తూనే ఉన్నారు. దీంతో తీగలాగితే డొంక అంతా కదిలింది.

Advertisement

రూ. 29 కోట్ల క్యాష్-15 కేజీల గోల్డ్- ఇప్పటివరకు 29 కోట్ల క్యాష్, 15 కేజీల బంగారం బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రభుత్వ ఆర్టీసీ డ్రైవర్ అయిన మినార్ మండల్, రాళ్ల వ్యాపారి తులు మండల్‌కు దగ్గర బంధువు. మినార్ గతంలో ప్రభుత్వ బస్సు డ్రైవర్‌గా పని చేశాడు. ఆ తర్వాత తన బంధువు తులు మండల్‌కు వ్యాపారంలో సహాయం చేయడానికి ఉద్యోగం మానేశాడు. కాలక్రమేణా డ్రైవర్ కూడా క్వారీ వ్యాపారిగా మారాడు. బుధవారం ఉదయం నుంచి అతడి ఇంట్లోనే కరెన్సీని లెక్కించారు అధికారులు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే అనుబ్రత మండల్‌కు అత్యంత సన్నిహితుడిగా చెబుతున్నారు.

కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా-గతేడాది డిసెంబర్ 28న డ్రైవర్ కమ్ వ్యాపారవేత్త అయిన మినార్ మండల్ కూతురు వివాహం  అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి నటుడు అర్బాజ్ ఖాన్, నటి జరీన్ ఖాన్, గాయని మోనాలి ఠాకూర్‌తో సహా పలువురు ప్రముఖ బాలీవుడ్ తారలు హాజరయ్యారు. అలాగే పలువురు బెంగాలీ సినీ తారలు కూడా హాజరయ్యారు. ఆ సమయంలో బీర్‌భూమ్‌ సిటీలో దాదాపు అన్ని హోటళ్లు అతిథుల కోసం బుక్ అయిపోయాయి. ఆ పెళ్లి చివరకు మినార్ మండల్‌కు ఎసరు పెట్టిందని అంటున్నారు. ఆనాటి నుంచి ఆయన రాజకీయ, అధికారుల దృష్టిలో పడ్డారు. అంతేకాదు పశువుల అక్రమ రవాణా కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మినార్‌కు సమన్లు ​​జారీ చేసింది.

Advertisement

ALSO READ: కర్ణాటక కాలేజీల్లో హెచ్ఐవీ బాంబు.. 7 వేల మంది విద్యార్థులకు పాజిటివ్

ఎలా సోదాలు చేశారు? తులు మండల్‌కు సన్నిహితుడు నజీబుద్దీన్ నివాసంలో ఓ ముఠాకు చెందిన అక్రమ నగదు, బంగారం దాచిపెట్టినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మంగళవారం రాత్రి ఈ ఆపరేషన్ మొదలుపెట్టారు.ఈ సంపద ఎలా వచ్చింది అనేదానిపై  తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని బెంగాల్‌ సీఎం ఎక్స్‌ వేదికగా తెలిపారు. ప్రజల సొమ్మును కొల్లగొట్టేవారిని ఎప్పటికీ వదిలిపెట్టమని అన్నారు. బీర్‌భూమ్‌లో దాదాపు 250 క్వారీలు అక్రమంగా నడుస్తున్నాయి. అవన్నీ తులు మండల్‌ కనుసన్నల్లో నడుస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×