E-Paper
Advertisement

కేరళ రాజకీయాల్లో రేవంత్ సెగ.. విజయన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ ముగిసింది!

కేరళ రాజకీయాల్లో రేవంత్ సెగ.. విజయన్ పాలనకు ఎక్స్‌పైరీ డేట్ ముగిసింది!
Advertisement

Kerala Politics: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేరళ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలోనూ, రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ అయ్యాయి. సాధారణంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరో రాష్ట్ర రాజకీయాల గురించి ఇంత సూటిగా, ఘాటుగా స్పందించడం అరుదు. కానీ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పినరయి విజయన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

ముఖ్యంగా.. ‘పినరయి విజయన్ రాజకీయ ఎక్స్‌పైరీ డేట్ ముగిసిపోయింది’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కేరళ ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబించేలా ఉంది. కేరళలో ఎల్డీఎఫ్ (LDF) పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని, వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయేది యూడీఎఫ్ (UDF) ప్రభుత్వమేనని, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి అక్కడ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

Advertisement

రేవంత్ రెడ్డి కేవలం విమర్శలకే పరిమితం కాకుండా, తమ బాధ్యతను కూడా గుర్తు చేశారు. ‘మేము ఈ రాష్ట్రాన్ని (కేరళను) పరిపాలిస్తాం, అభివృద్ధి పథంలో నడిపిస్తాం’ అని అనడం ద్వారా కేరళ అభివృద్ధిపై కాంగ్రెస్ విజన్‌ను స్పష్టం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏ విధంగానైతే మార్పు తెచ్చిందో, అదే తరహాలో కేరళను కూడా అభివృద్ధి చేస్తామనే నమ్మకాన్ని ఆయన కలిగించే ప్రయత్నం చేశారు.

మొత్తానికి రేవంత్ రెడ్డి మాటలు కేరళలోని కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పొరుగు రాష్ట్రం నుంచి అందుతున్న ఈ మద్దతు, కేరళ ఎన్నికల రాజకీయాన్ని మరింత ఆసక్తికరంగా మార్చింది. విజయన్ పాలనకు చరమగీతం పాడటమే లక్ష్యంగా కాంగ్రెస్ అడుగులు వేస్తోందని ఈ వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది.

Advertisement

Also Read:ట్రంప్ ‘షాడో వార్’.. గన్ వాడకుండానే గొంతు నులుముతున్న వైట్ హౌస్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×