E-Paper
Advertisement

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దే
Advertisement

Ration Card New Rules 2026: రేషన్‌ కార్డుదారులకు ముఖ్య గమనిక. రేషన్ కార్డులో అనర్హుల ఏరివేత కార్యక్రమం మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ రాబోతున్నాయి. కేంద్రప్రభుత్వం అమలు చేయనున్న నిబంధనల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి. రేషన్ పంపిణీలో పారదర్శకత పెంచేందుకు, అనర్హులను తొలగించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్

Advertisement

దేశంలో పేద-మధ్యతరగతి కుటుంబాలకు ఆహార భద్రత కల్పించడంలో రేషన్ కార్డు కీలక పాత్ర. ప్రభుత్వం అమలు చేస్తున్న పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా తక్కువ ధరలకు బియ్యం, గోధుమలు, చక్కెర, ఆయిల్ వంటివి సరుకులు అందుతున్నాయి. ఈ వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2026 ఏప్రిల్ ఒకటి నుండి కొత్త నిబంధనలను అమలు చేయనుంది.

రేషన్ కార్డులో ఉన్నవ్యక్తి తప్పనిసరిగా e-KYC చేయించుకోవాలి. సమీపంలోని రేషన్ షాపుకు వెళ్లి బయో మెట్రిక్ వేసుకోవచ్చు. మేరా రేషన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ఉపయోగించి మీ KYCని పూర్తి చేయాలి. ఈ- కేవైసీ పూర్తి చేయకపోతే ఏప్రిల్ ఒకటి నుండి మీకు రావాల్సిన రేషన్ నిలిచిపోయే అవకాశముంది.

Advertisement

ఏప్రిల్ ఒకటి కొత్త నిబంధనలు, తేడా వస్తే కార్డు రద్దు

కొత్త రేషన్ కార్డు దరఖాస్తు దారులకు వార్షిక ఆదాయ పరిమితిని పెంచింది ప్రభుత్వం. 18 ఏళ్లు పైబడిన మహిళను కుటుంబ పెద్దగా లెక్కలోకి తీసుకుంటారు. రేషన్ కార్డు కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. దరఖాస్తు ప్రక్రియ అంతా ఆన్‌లైన్‌లో జరుగుతుంది. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ పత్రాలు ఉండాలి.

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే ఫుడ్ సప్లై ఆఫీసర్ ఇంటికి వచ్చి ధృవీకరణ చేసిన తర్వాత కార్డు జారీ అవుతుంది. కొత్త నిబంధనల ప్రకారం లబ్ధిదారులు ఒకేసారి మూడు నెలల కోటాను పొందవచ్చు. దీనివల్ల ప్రతి నెలా రేషన్ షాపుకు వెళ్లాల్సిన పని లేదు, క్యూలలో నిలబడాల్సిన పని అంతకంటే ఉండదు.

ALSO READ: తమిళ రాజకీయంలో దళపతి ఎంట్రీ.. పెరంబూర్, తిరుచ్చి ఈస్ట్ నుండి బరిలోకి విజయ్..

కుటుంబంలో ఎవరైనా ఆదాయపు పన్ను చెల్లిస్తే కార్డు రద్దువుతుంది. ట్రాక్టర్ మినహా నాలుగు చక్రాల వాహనం ఉంటే క్యాన్సిల్ అవుతుంది. మూడు నెలల పాటు రేషన్ తీసుకోకపోతే మీ పేరు ప్రభుత్వం తొలగించే అవకాశం ఉంది. సభ్యులు మరణించినా, వివాహమై వెళ్లిపోయినా వారి పేర్లను తొలగించకపోతే కార్డులో ఇబ్బందులు రావచ్చు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×