// // Bengaluru: కర్ణాటక డీకే ప్రభుత్వం చిన్న చిన్న తుపాన్లు.. మంత్రి పదవికి రామలింగా రెడ్డి రాజీనామా, ఎందుకంటే.. -->
E-Paper
Advertisement

కర్ణాటకలోని డీకే ప్రభుత్వంలో చిన్న చిన్న తుపాన్లు.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా, ఎందుకంటే..

కర్ణాటకలోని డీకే ప్రభుత్వంలో చిన్న చిన్న తుపాన్లు.. మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా, ఎందుకంటే..
Advertisement

Bengaluru: కర్ణాటకలోని డీకే ప్రభుత్వం అప్పుడు లుకలుకలు మొదలయ్యాయి. రెండు రోజుల కిందట ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పగ్గాలు చేపట్టారు. ఆయనతోపాటు పలువురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే శాఖల కేటాయింపు వ్యవహారంపై దుమారం మొదలైంది. ఈ నేపథ్యంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు రామలింగారెడ్డి.

కర్ణాటక డీకే ప్రభుత్వం చిన్న చిన్న తుపాన్లు

Advertisement

కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న తుపాన్లు వస్తుంటాయి. ప్రభుత్వం అధికారంలో ఉన్నా, లేకున్నా నేతలు మాత్రం రాజీనామాలతో తమ అసంతృప్తిని బయటపెడుతుంటారు. తాజాగా కర్ణాటక మంత్రి రామలింగారెడ్డి కూడా అదే చేశారు. సరైన పదవి దక్కని కారణంగా మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ వార్త దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడారు మంత్రి రామలింగారెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ముందు డీకే శివకుమార్ మా ఇంటికి వచ్చారని తెలిపారు. బెంగళూరు పోర్ట్‌ఫోలియో ఇస్తామని చెప్పారని, ఆ సమయంలో తాను ఏ పోర్ట్‌ ఫోలియో అడగలేదన్నారు.

Advertisement

నచ్చిన పదవి ఇవ్వలేదని మంత్రి పదవికి రామలింగారెడ్డి రాజీనామా

ఆయన స్వయంగా ప్రతిపాదించడంతో తాను సరే అన్నానని అన్నారు వివరించారు. తనకు ఆ శాఖను ఇస్తామని రెండుసార్లు హామీ ఇచ్చారని, ఆ తర్వాత నీటిపారుదల శాఖను కేటాయించారని వివరించారు. అది తనకు ఆమోదయోగ్యం కాదని, అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

తనకు నచ్చిన మంత్రి పదవిని ఆఫర్ చేసినప్పటికీ తాను అంగీకరించనని మనసులోని మాట బయటపెట్టారు రామలింగారెడ్డి. బెంగళూరు పోర్ట్‌ ఫోలియో ఇచ్చినా అంగీకరించనని, తాను ఎమ్మెల్యేగా ఉంటానని, కాంగ్రెస్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. రామలింగారెడ్డి తన రాజీనామా వ్యవహారం సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది.

ALSO READ: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

రామలింగారెడ్డి సీనియర్ నాయకుడు, తనకు సన్నిహిత మిత్రడని, ఈ సమస్యను పరిష్కరించుకుంటానని అన్నారు. రామలింగారెడ్డి తన రాజీనామా వ్యవహారం సీఎం డీకే శివకుమార్ వద్దకు చేరింది. రామలింగారెడ్డి సీనియర్ నాయకుడు, తనకు సన్నిహిత మిత్రడని, ఈ సమస్యను పరిష్కరించుకుంటానని అన్నారు.

గురువారం రాత్రి ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మంత్రి వర్గంలోని 13 మంది శాఖలను కేటాయించారు. బెంగళూరు అభివృద్ధి శాఖ విషయంలో రామలింగారెడ్డి పట్టుబట్టినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకు ముఖ్యమంత్రి నిరాకరించారని తెలిపాయి. పోర్ట్‌ ఫోలియోలను ఖరారు చేసేందుకు గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో రామలింగారెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×