E-Paper
Advertisement

Rajnath Singh : సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..

Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లో పూంఛ్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి జమ్ము కాశ్మీర్ లో పర్యటించారు. అనంతరం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

Rajnath Singh : సైనికులపై దాడిని ఉపేక్షించం.. ఉగ్రవాదులకు రాజ్‌నాథ్‌ సింగ్ హెచ్చరిక..
Advertisement

Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని పూంఛ్‌ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి జమ్ము కశ్మీర్ లో పర్యటించారు. అనంతరం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానమన్నారు. ప్రతి భారతీయుడి భావన ఇదే అన్నారు. మీకు చెడుచేయాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మీపై శత్రు మూకలు చేసే దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మీరంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలుసన్నారు. మీ ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి కొనియాడారు. ఒక సైనికుడు అమరుడైతే.. మేమిచ్చే పరిహారంతో ఆ నష్టాన్ని పూడ్చలేమన్నారు. ప్రభుత్వం ఎప్పటికీ మీ వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. మీ భద్రత, సంక్షేమం తమకు అధిక ప్రాధాన్యమని స్పష్టం చేశారు.

Advertisement

ఇటీవల ఆర్మీ ఆపరేషన్లలో లోపాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి అధికారి విచారణను ఎదుర్కొంటున్నారు. మరోపక్క పూంఛ్‌ జిల్లాలో ఆర్మీ కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరోపక్క ఆర్మీ వాహనాలపై దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రి పర్యటించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×