E-Paper
Advertisement

ప్రధాని పర్యటనకు ముందే షాక్.. రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ఎగసిపడ్డ మంటలు!

ప్రధాని పర్యటనకు ముందే షాక్..  రూ. 80 వేల కోట్ల ప్రాజెక్టులో ఎగసిపడ్డ మంటలు!
Advertisement

Rajasthan refinery fire accident: రాజస్థాన్‌లోని బాడ్మేర్‌లో నిర్మాణంలో ఉన్న హెచ్‌పీసీఎల్ (HPCL) రాజస్థాన్ రిఫైనరీ ప్రాజెక్టులో సోమవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సుమారు రూ. 80,000 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ పెట్రో కెమికల్ ప్లాంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తీవ్ర కలకలం రేగింది. ప్లాంట్‌లోని ఒక విభాగం నుండి మంటలు భారీగా ఎగసిపడటంతో అక్కడి సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక యంత్రాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.

ఈ పెట్రో కెమికల్ ప్లాంట్‌ను రేపు (మంగళవారం) ప్రధాని మోదీ స్వయంగా ప్రారంభించాల్సి ఉంది. ప్రధాని పర్యటనకు సరిగ్గా ఒక రోజు ముందు ఈ అగ్నిప్రమాదం జరగడం భద్రతా యంత్రాంగాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రాణాపాయం జరగలేదని ప్రాథమిక సమాచారం అందుతోంది.

Advertisement

ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో రాజస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే రిఫైనరీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ఈ అగ్నిప్రమాదం వల్ల ప్రారంభోత్సవ షెడ్యూల్‌లో ఏవైనా మార్పులు ఉంటాయా లేదా అనే అంశంపై అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వలేదు. భద్రతా సిబ్బంది, ప్లాంట్ అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారు.

Read Also: తెలిసిన వ్యక్తిలా ఫోన్ కాల్స్.. AI వాయిస్ క్లోనింగ్ స్కామ్.. నమ్మితే ఖాతా ఖాళీ!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×