E-Paper
Advertisement

Viral Video: భార్యను బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన భర్త – అలా చేయడానికి కారణం ఇదేనట

Viral Video: భార్యను బైక్‌కు కట్టి ఈడ్చుకెళ్లిన భర్త – అలా చేయడానికి కారణం ఇదేనట
Advertisement

Rajasthan Viral video: ఈ మధ్యకాలంలో దారుణమైన ఘటనలు రాజస్థాన్‌లో చోటు చేసుకుంటా యి. నాగౌర్ జిల్లాలో జరిగిన ఓ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం, సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. కాకపోతే ఇప్పటివరకు బాధితురాలు ఫిర్యాదు చేయలేదు. ఇంతకీ అసలేం జరిగిందంటే..

నాగౌర్ జిల్లాలోని నహర్‌సింగ్ పుర గ్రామంలో ప్రేమ్‌రామ్ మేఘవాల్ దంపతులు ఉంటున్నారు. ఆరునెలల కిందట మ్యారేజ్ అయ్యింది. మేఘవాల్‌ కు అత్తింటివారితో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి. ఆ సంగతి పక్కనబెడితే జైసల్మేర్‌లో తన సోదరి ఇంటికి వెళ్తానని భర్తతో చెప్పిందామె. అందుకు అతగాడు ససేమిరా అన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

Advertisement

పట్టరాని కోపంతో లిక్కర్ షాపుకి వెళ్లాడు మేఘవాల్. మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత భార్యపై దాడి చేసి కాళ్లను కట్టేశాడు. ఆ తర్వాత టూ వీలర్స్‌ వెనుక కట్టి తన గ్రామానికి ఈడ్చుకెళ్లాడు. కడుపు నొప్పితో ఆ మహిళ బాధపడుతూ సాయం కోసం అరిచింది. అసలే పల్లెలూరు.. అందులోనూ ఫ్యామిలీ వ్యవహారం ఎవరూ జోక్యం చేసుకోలేదు.

ALSO READ: ఢిల్లీ మద్యం పాలసీ కేసు.. కేజ్రీవాల్ బెయిల్ పిటీషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ

Advertisement

అదే రూట్లో ఓ మహిళ వెళ్తోంది. ఆమె కూడా పట్టించుకోలేదు. ఇక ఈ తతంగాన్ని ఓ వ్యక్తి చిత్రీకరిస్తున్నా డు. అతడు సైతం రియాక్ట్ కాలేదు సరికదా, మేఘవాల్‌కు మద్దతుగా నిలిచాడు. చివరకు ఇంటికి తీసు కొచ్చాడు. ఊరిలో వ్యక్తులు సైతం నోరెత్తలేదు. ఈ ఘటన గత నెల జరిగింది.

తాజాగా ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో స్థానిక పోలీసులు రియాక్ట్ అయ్యారు. నిందితుడ్ని అరెస్ట్ చేశారు. బాధితు రాలు పంజాబ్‌లో తన తల్లి వద్ద ఉంటోంది. ఇంత చేసినా భర్తపై కనీసం పోలీసు లకు ఫిర్యాదు చేయలేదు ఆ ఇల్లాలు.

https://twitter.com/IsrarNchaudhary/status/1823298750694986146

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×