E-Paper
Advertisement

Live-in-Relationship Verdict: పెళ్లి వయస్సు రాకున్నా.. సహజీవనం చేయొచ్చు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

Live-in-Relationship Verdict: పెళ్లి వయస్సు రాకున్నా.. సహజీవనం చేయొచ్చు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Advertisement

Live-in-Relationship Verdict: పెళ్లి వయస్సు రాకున్నా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఇరువురి మేజర్లకు ఉందని రాజస్థాన్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సహజీవనం చేస్తున్న కోటాకు చెందిన యువతి(18), యువకుడు(19) తమకు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. యువతి కుటుంబం వీరి సంబంధాన్ని వ్యతిరేకించి, చంపేస్తామని బెదిరించడంతో వారు కోర్టుకెక్కారు. కోటాలోని పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినప్పటికీ, ఎటువంటి చర్యలు తీసుకోలేదని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

ఆర్టికల్ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛ హక్కు

భారతదేశంలో మహిళలకు చట్టబద్ధమైన వివాహ వయస్సు 18 సంవత్సరాలు, పురుషులకు 21 సంవత్సరాలు. కోటాకు చెందిన ఒక యువ జంట దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ, ఇద్దరి అంగీకారం మేరకు వివాహ వయస్సు రాకున్నా సహజీవనంలో ఉండవచ్చని రాజస్థాన్ హైకోర్టు పేర్కొంది. 18 సంవత్సరాలు దాటిన వారిని మేజర్లుగా గుర్తిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు హామీ ఇస్తుందని కోర్టు పేర్కొంది.

18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు

Advertisement

కోటాకు చెందిన 18 ఏళ్ల యువతి, 19 ఏళ్ల యువకుడు తమను రక్షించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను విచారిస్తూ జస్టిస్ అనూప్ ధండ్ ఈ తీర్పు ఇచ్చారు. పరస్పర అంగీకారం ద్వారా తాము సహజీవనం చేస్తున్నామని కోర్టుకు తెలిపింది యువ జంట. తమకు ప్రాణహాని ఉందని పోలీసు రక్షణ కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ జంట అక్టోబర్ 27, 2025న లివ్-ఇన్ రిలేషన్షిప్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కోర్టుకు తెలిపింది.

Also Read: Sabarimala: శబరిమలలో మళ్లీ రచ్చ.. తెలుగు భక్తులపై స్థానిక వ్యాపారుల దాడి, రంగంలోకి పోలీసులు

Advertisement

పబ్లిక్ ప్రాసిక్యూటర్ వివేక్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. యువకుడికి 21 ఏళ్లు పూర్తి కాకపోవడంతో అతడు చట్టబద్ధంగా వివాహం చేసుకోలేడని, లివ్-ఇన్ పార్టనర్‌షిప్‌లో ఉండటానికి అనుమతించకూడదని వాదించారు. అయితే ఈ పిటిషన్ పై తీర్పు ఇస్తూ… చట్టబద్ధంగా పెళ్లి చేసుకోలేనంత మాత్రాన ప్రాథమిక హక్కులను కోల్పోకూడదని జస్టిస్ అనూప్ తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×