E-Paper
Advertisement

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు

Railway Charges: రైల్వే ఛార్జీల పెంపు నేటి నుంచే.. ఈ టికెట్లకు మినహాయింపు
Advertisement

Railway Charges: భారతీయ రైల్వే.. ఇటీవల టికెట్ల రేట్లు పెంచిన విషయం తెలిసిందే. పెంచిన టికెట్ ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వచ్చింది. ఆరు నెలల్లో రెండోసారి రైల్వేశాఖ ఛార్జీలు పెంచింది. ఇప్పటికే తమ రైలు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులు డిసెంబర్ 26న లేదా ఆ తర్వాత ఎటువంటి అదనపు ఛార్జీ చెల్లించాల్సిన అవసరం లేదని రైల్వే అధికారులు స్పష్టం చేశారు. రోడ్డు, విమాన ప్రయాణాలతో పోలిస్తే రైలు ప్రయాణం అత్యంత తక్కువగా ఉంటుందని అధికారులు అంటున్నారు.

పెరిగిన ఛార్జీలు ఇలా

కొత్త రైలు ఛార్జీల ప్రకారం, నాన్-ఏసీ కోచ్‌లలో 500 కి.మీ వరకు ప్రయాణించే ప్రయాణికులు అదనంగా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. నాన్-ఏసీ కోచ్‌లలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లకు కి.మీ.కు 2 పైసలు పెంచగా, ఏసీ క్లాస్ ఛార్జీలు కూడా కి.మీ.కు 2 పైసలు పెంచింది. 215 కి.మీ వరకు సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్లు, సెకండ్ క్లాస్ ఆర్డినరీ ప్రయాణాలకు ఛార్జీల పెంచలేదు. నాన్-సబర్బన్ మార్గాలతో సహా సబర్బన్ సర్వీసులు, సీజన్ టికెట్ల ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. సెకండ్ క్లాస్ ఆర్డినరీలో 215 కి.మీ వరకు ప్రయాణాలకు ఛార్జీల పెంపు లేదు.

ప్రధాన సర్వీసుల ఛార్జీలు పెంపు

Advertisement

తేజస్ రాజధాని, రాజధాని, శతాబ్ది, దురంతో, వందే భారత్, హమ్‌సఫర్, అమృత్ భారత్, తేజస్, మహామన, గతిమాన్, అంత్యోదయ, గరీబ్ రథ్, యువ ఎక్స్‌ప్రెస్, జన శతాబ్ది, నమో భారత్ రాపిడ్ రైల్, ఆర్డినరీ నాన్-సబర్బన్ సర్వీసులు (AC MEMU/DEMU మినహా) ప్రధాన రైలు సర్వీసులు ప్రాథమిక ఛార్జీలను సవరించారు. రిజర్వేషన్ ఫీజులు లేదా సూపర్‌ఫాస్ట్ ఛార్జీలలో ఎలాంటి మార్పు లేదని రైల్వే శాఖ తెలిపింది.

Also Read: Lucknow Flower Pots: పీఎం ప్రోగ్రామ్ అవ్వగానే.. క్షణాల్లో పూల కుండీలు మాయం.. వీడియో వైరల్

పాత టికెట్లకు వర్తించదు

Advertisement

పెంచిన రేట్లు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లకు వర్తించవని రైల్వేశాఖ ప్రకటనలో తెలిపింది. దీని ప్రకారం, డిసెంబర్ 26, 2025న లేదా ఆ తర్వాత ప్రయాణాలకు ఎటువంటి ఛార్జీలు తేడా ఉండదని పేర్కొంది. అయితే పెంచిన ఛార్జీలను టీటీఈ జారీ చేసిన టికెట్లకు వర్తిస్తుందని తెలిపింది. ఇవాళ్టి నుంచి రైళ్లలో లేదా స్టేషన్లలో టీటీఈలు లేదా టికెట్ తనిఖీ సిబ్బంది జారీ చేసిన కొత్త టికెట్లకు పెంచిన ధరలు వసూలు చేస్తామని రైల్వేలు స్పష్టం చేశాయి. పెంచిన ఛార్జీల జాబితాలను అన్ని రైల్వే స్టేషన్లలో ప్రదర్శించినట్లు అధికారులు తెలిపారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×