E-Paper
Advertisement

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు.. ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చింది, ఇక కష్టాలు మొదలు
Advertisement

Raebareli: నరేంద్రమోదీ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ. రాబోయే ఆర్థిక షాక్ అదానీ-అంబానీ, మోదీలను ప్రభావితం చేయదన్నారు. చాలా సంవత్సరాలలో చూడని తీవ్రతతో విరుచుకు పడటానికి సిద్ధంగా ఉందన్నారు. మున్నుముందు కష్టకాలం తప్పదని చెప్పకనే చెప్పారు.

మోదీ ప్రభుత్వంపై రాహుల్ ఘాటు వ్యాఖ్యలు

Advertisement

మోదీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థపై ఆర్థిక తుఫాను రాబోతోందని కొన్నాళ్లుగా తాను చెబుతున్నారని అన్నారు. అదానీ-అంబానీలకు అనుకూలంగా ఆయన నిర్మించిన వ్యవస్థ నిలవదన్నారు. అది పూర్తిగా కూలిపోవడం ఖాయమని మనసులోని మాట బయట పెట్టారు. ఆ భారాన్ని సామాన్య ప్రజలు మోయాల్సి వస్తుందన్నారు.

వాళ్లంతా తమ రాజ భవనాల్లో కూర్చొంటారని అన్నారు. దాని పరిణామాలను అనుభవించేది యువత, ప్రజలేనని అన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీ చర్యలు తీసుకోవడానికి బదులుగా విదేశీ పర్యటనలకు వెళ్లవద్దని దేశానికి చెబుతున్నారు, కానీ మాత్రం ప్రపంచమంతా పర్యటిస్తున్నారని ఎద్దేవా చేశారు. దేశంలోని యువత, రైతులు, కార్మికులు, చిన్న వ్యాపారులపై తీవ్ర ప్రభావితం చేస్తుందన్నారు.

Advertisement

ఆర్థిక తుఫాను ఉగ్రరూపం దాల్చిందన్న రాహుల్‌గాంధీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా లక్నో ఎయిర్‌పోర్టులో రాహుల్ గాంధీకి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలికారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలి నియోజక‌వర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు.

అంతకుముందు నార్వే పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర‌మోదీ జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలను తప్పించుకున్నారని రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని ప్రవర్తన దేశ ప్రతిష్టను దెబ్బతీసిందన్నారు. నార్వేలో మోదీ వెళ్ళిపోతుండగా ఓ జర్నలిస్ట్ ఆయనను ప్రశ్నించడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని చూపిస్తున్న ఒక వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు.

ALSO READ: సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. ఆ వీధి కుక్కలను చంపేయొచ్చు!

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×