E-Paper
Advertisement

Rahul Ghandi: మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!

Rahul Ghandi: మోడీకి రాహుల్ గాంధీ కౌంట‌ర్.. ఆయ‌న రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌లేదు!
Advertisement

రాహుల్ గాంధీ చూపిస్తున్న రాజ్యాంగం రెడ్ లేబుల్ క‌లిగిన‌ బుక్ ఖాళీ పేజీల‌తో ఉంద‌ని ప్ర‌ధాని మోడీ చేసిన కామెంట్ల‌కు కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ కౌంట‌ర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ చ‌ద‌వ‌నందుకే మోడీ రాజ్యాంగం ఖాళీగా ఉంద‌ని భావిస్తున్నార‌ని విమ‌ర్శించారు. మ‌హారాష్ట్ర‌లోని నందుబాబ‌ర్ లో జ‌రిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మ‌హాత్మాగాంధీ, అంబేద్క‌ర్, బిర్సా ముండా లాంటి గొప్ప‌వారు రూపొందించిన ఉన్నాయ‌న్నారు.

తాను తీసుకెళ్లిన రాజ్యాంగ ప్ర‌తి ఎరుపు క‌వ‌ర్ తో ఉండ‌గా బీజేపీ నాయకులు విమ‌ర్శించార‌ని అన్నారు. ఉప ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ అర్బ‌న్ నక్స‌ల్స్ మ‌రియు అరాచ‌క‌వాదుల‌కు మ‌ద్ద‌తు ఇచ్చార‌ని వ్యాఖ్యానించారంటూ మండిప‌డ్డారు. పుస్తకం రంగు ఎరుపు అని బీజేపీకి అభ్యంత‌రాలు ఉన్నాయ‌ని, కానీ తాము ఎరుపు రంగా నీలం రంగా అని ప‌ట్టించుకోలేద‌ని చెప్పారు.

Advertisement

రాజ్యాంగాన్ని ప‌రిర‌క్షణ‌కు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. అంతే కాకుండా రాజ్యాంగ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్రాణాలు ఇవ్వ‌డానికి అయినా సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. భార‌త దేశ మౌళిక సూత్రాల‌ను బీజేపీ ఎప్పుడూ కించ‌ప‌రుస్తూనే ఉంటుంద‌ని విమ‌ర్శించారు. ఈ బుక్ ఖాళీగా లేద‌ని, దేశానికి సంబంధించిన ఆత్మ‌, ఎంతో నాలెడ్జ్ ఉన్నాయ‌ని అన్నారు. ఆదివాసీలే ఈ దేశానికి మూల‌వాసుల‌ని కానీ తొంభై మంది అధికారులు ఉంటే అందులో కేవ‌లం ఒక్క‌రు మాత్ర‌మే ఆదివాసీలు ఉన్నార‌ని చెప్పారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×