E-Paper
Advertisement

Rahul Gandhi : నా భార్య ఎలా ఉండాలంటే.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..

Rahul Gandhi : నా భార్య ఎలా ఉండాలంటే.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు..
Advertisement

Rahul Gandhi : రాహుల్ గాంధీ ఇండియాలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరు. ఆయన వయస్సు ఇప్పుడు 52 ఏళ్లు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారనే ప్రశ్నలు చాలా కాలం నుంచి ఎదురవుతున్నాయి. రాహుల్ మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే భార్య ఎలా ఉండాలి అనే విషయంపై తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్‌ జోడో యాత్ర చేస్తున్న రాహుల్‌ గాంధీ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ గురించి ప్రస్తావించారు. నానమ్మ అంటే తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు.

భార్యలో ఆ ఇద్దరి లక్షణాలుండాలి..
కాబోయే జీవిత భాగస్వామి ఎలా ఉండాలని అడిగిన ప్రశ్నకు ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. నానమ్మ ఇందిరా గాంధీ లాంటి లక్షణాలు ఉన్న మహిళ అయితే తనకు అభ్యంతరం లేదన్నారు. ఇందిరా, సోనియా గాంధీ లక్షణాలు కలిసి ఉంటే ఇంకా మంచిదని స్పష్టం చేశారు.

Advertisement

కార్లంటే మోజు లేదు..
ఇంకా ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన ఇష్టాఇష్టాలను వెల్లడించారు. తన అభిరుచులు చెప్పుకొచ్చారు. కార్లపై అంతగా మోజు లేదన్నారు. తనకు సొంతకారు కూడా లేదని తెలిపారు. ఇంట్లో కారు ఉన్నా.. అది అమ్మది అన్నారు. అయితే కార్లంటే అంతగా ఆసక్తి లేకపోయినా వాటికి వచ్చే సాంకేతిక సమస్యలు మాత్రం 90 శాతం తెలుసన్నారు. కార్లను రిపేర్‌ చేస్తానన్నారు. తనకు గాలిలో, నీటిలో, నేలమీద ఎక్కడైనా సరే వేగంగా దూసుకెళ్లడమంటే ఇష్టమన్నారు.

ఆ బైక్‌ అంటే ఇష్టం
సైక్లింగ్‌ అంటే తనకెంతో ఇష్టమని రాహుల్ గాంధీ తెలిపారు. ఇక బైక్‌ల్లో ఎన్‌ఫీల్డ్‌ నచ్చదన్నారు. తనకు ఓల్డ్‌ లాంబ్రెట్టా చాలా నచ్చుతుందన్నారు. ఆ బైక్ నడపాలంటే కష్టమన్నారు. లండన్‌లో ఉన్న సమయంలో అప్రిలియా ఆర్‌ఎస్‌ 250 బైక్‌ ఉండేదని చెప్పారు. ఇలా బైక్‌లపై ఉన్న అభిరుచులను రాహుల్‌ గాంధీ వివరించారు.

Advertisement

తనపై వచ్చే ఆరోపణలు, పప్పూ అంటూ చేసే విమర్శలపైనా రాహుల్‌ గాంధీ స్పందించారు. తనను తిట్టినా.. కొట్టినా. ఎవరినీ ద్వేషించనని స్పష్టం చేశారు. జీవితంలోని ఏమి సాధించలేక, బంధుత్వాలు సరిగా లేక కొందరు బాధ పడుతుంటారని అందుకే వారు ఎదుటివారిని దూషిస్తుంటారని రాహుల్ అన్నారు. తనను ఎంత తిట్టినా స్వాగతిస్తానని , ఎన్ని పేర్లు పెట్టినా లెక్కచేయనని తేల్చిచెప్పారు. దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు మొదలు.. డ్రోన్‌ విప్లవం వరకు ఇలా ఎన్నో అంశాలపైనా రాహుల్ తన అభిప్రాయాలను పంచుకున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×