E-Paper
Advertisement

Rahul Gandhi : మాట నిలబెట్టుకున్న రాహుల్.. విద్యార్థుల హెలికాప్టర్ టూర్..

Rahul Gandhi : మాట నిలబెట్టుకున్న రాహుల్.. విద్యార్థుల హెలికాప్టర్ టూర్..
Advertisement

Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో పాదయాత్రలో భాగంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ముగ్గురు బాలికలను హెలికాప్టర్ లో తీసుకెళ్లి, వారి కోరిక నెరవేర్చారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం గుడ్లి వద్ద ఇది జరిగింది. 20 నిమిషాల పాటు వారిని హెలికాప్టర్ లో తిప్పారు.

భారత్ జోడో యాత్రలో భాగంగా నవంబర్ 29న ఉజ్జయినిలో రాహుల్ పర్యటిస్తున్న సమయంలో.. సీతల్ పటిదార్ అనే ఏడో తరగతి చదువుతున్న బాలిక, 10వ తరగతి విద్యార్థిని అంతిమా పన్వర్, గిరిజ పన్వర్ కలిశారు. ఓ సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా వీరు తమను పరిచయం చేసుకున్నారు. వారి కలలు, ఆకాంక్షలు, చదువుల గురించి ఆ సందర్భంలో రాహుల్ అడిగి తెలుసుకున్నారు. తాము రాహుల్ తో కలసి హెలికాప్టర్ రైడ్ చేయాలని అనుకుంటున్నట్టు వారు చెప్పారు.

Advertisement

త్వరలోనే దీన్ని సాధ్యం చేస్తానని రాహుల్ హామీ ఇచ్చి ముందుకు సాగిపోయారు. దాన్ని ఎట్టకేలకు గురువారం నెరవేర్చారు. వారిని హెలికాప్టర్ లో ఎక్కించుకుని, టెక్నికల్ విషయాలను పైలట్ తో కలసి రాహుల్ వివరించారు. వారికి చాక్లెట్లు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఫోటోలు కూడా తీసుకున్నారు. కుటుంబ సభ్యుల ఒత్తిడితో కాకుండా, తమకు నచ్చిన కెరీర్ ఎంపిక చేసుకోవాలని, అనుకున్న లక్ష్యాలను సాధించాలని రాహుల్ వారిని ప్రోత్సహించారు.

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×