E-Paper
Advertisement

Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!

Rahul Gandhi: మ‌హా రైతుల‌తో రాహుల్ వీడియో కాల్.. ఆ పంట‌ల‌కు మ‌ద్ద‌తు ధ‌ర ఇస్తామ‌ని హామీ!
Advertisement

మహారాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌చారంలో కాంగ్రెస్ దూసుకుపోతుంది. అన్ని వ‌ర్గాల వారికి ఉప‌యోగ‌ప‌డేలా ప‌థ‌కాలు ర‌చిస్తూ ముందుకు వెళుతోంది. ఆ పార్టీ అగ్ర‌నాయ‌కుడు రాహుల్ గాంధీ సైతం మ‌హారాష్ట్ర ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రాహుల్ గాంధీ మ‌హారాష్ట్ర రైతుల‌తో వీడియో కాల్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా రైతులు త‌మ బాధ‌ల‌ను రాహుల్ గాంధీకి చెప్పుకుని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

దీంతో రాహుల్ ఎన్నిక‌ల్లో గెలిపిస్తే ప‌లు హామీలు అమ‌లు చేస్తామ‌ని వారికి చెప్పారు. వ‌చ్చే డ‌బ్బుల‌తో త‌మ బిడ్డ‌ల‌ను ఏం చ‌దివిస్తామో.. ఏం తిండి పెడ‌తామో అర్థం కావ‌డం లేద‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. దీంతో మ‌హారాష్ట్ర రైతుల కోసం మ‌హావికాస్ అఘాడీ కూటమి చారిత్రాత్మ‌క అడుగులు వేస్తామ‌ని హామీ ఇచ్చారు.

Advertisement

సోయాబీన్ కు క్వింటాలుకు రూ.7000 ఎంఎస్ ప్ల‌స్ బోన‌స్ ఇస్తామ‌ని చెప్పారు. ఉల్లికి కూడా స‌రైన మ‌ద్ద‌తు ధ‌ర నిర్ణ‌యించేందుకు క‌మిటీ వేస్తామ‌ని హామీ ఇచ్చారు. అదే విధంగా ప‌త్తికి కూడా మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చి ఆ రైతుల‌ను సైతం ఆదుకుంటామ‌ని చెప్పారు. గ‌త మూడు ఎన్నిక‌ల‌లో సోయాబీన్ కు రూ.6వేల రూపాయలు ఎంఎస్పీ ఇస్తామ‌ని బీజేపీ వాగ్దానం చేసింద‌ని చెప్పారు. కానీ నేటికీ రైతులు త‌మ ర‌క్తం, చెమ‌ట‌తో పండించిన సోయాబీన్ కు రూ.3వేల నుండి రూ.4వేల రూపాయ‌ల‌కు అమ్ముతున్నార‌ని చెప్పారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×