E-Paper
Advertisement

Rahul Gandhi | అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యక్రమం.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠపై రాహుల్ గాంధీ

Rahul Gandhi | దేశంలో ఒకవైపు రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరుగుతుంటే.. మరోవైపు రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రం చేపట్టారు. ఈ యాత్రతో ఆయన దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి, లోక్ సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ రూట్ మ్యాప్ తయారు చేసుకోవడానిక ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే బాగా ఆలోచించి ఈ యాత్రను మణిపూర్ నుంచి మొదలుపెట్టారు.

మంగళవారం భారత్ జోడో న్యాయ్ యాత్ర మూడవ రోజు సందర్భంగా రాహుల్ గాంధీ.. అయోధ్య రామ్ మందిర కార్యక్రమంపై పెదవి విప్పారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..” కాంగ్రెస్ కోసం నేను ఈ యాత్ర ప్రారంభించాను. మాకు ముందు నుంచీ ఒక ప్లాన్ ప్రకారం యాత్రను కొనసాగిస్తాం. జనవరి 22న అయోధ్యలో కార్యక్రమం సమయానికి నేను అస్సాంలో ఉంటాను. అయినా ఆర్ఎస్ఎస్, బీజేపీ, జనవరి 22 కార్యక్రమాన్ని నరేంద్ర మోదీ షోగా మార్చేశారు. అది పూర్తిగా ఒక రాజకీయ కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని వాళ్లు ఎన్నికల కోసం ఉపయోగిస్తున్నారు. అందుకే కాంగ్రెస్ నేతలు ఆ కార్యక్రమానికి పోకూడదని నిర్ణయించారు.

Advertisement

మేము అన్ని మతాలను గౌరవిస్తామ, ఎవరైనా కాంగ్రెస్ నాయకులు అయోధ్య కార్యక్రమానికి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. పైగా హిందూ మత పెద్దలే ఆ కార్యక్రమానికి వెళ్లడం లేదని తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మేము అక్కడికి వెళ్లడం కష్టమే. నేను మతాన్ని ఆచరిస్తాను . దాని ద్వారా లాభాలు పొందాలను కోను. నేను హిందువునని నా షర్టుపై రాసుకొని తిరగను. నేను నా జీవితంలో హిందువుగా నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. నేను పైకి చూపించుకోను. మతాన్ని గౌరవించని వాళ్లే ఇలాగా ఆర్భాటాలు చేస్తారు.” అని చెప్పారు.

Advertisement

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×