E-Paper
Advertisement

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!

Karnataka CM Post: “ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు”: కర్ణాటక సీఎం పీఠంపై డీకే శివకుమార్ ఆసక్తికర పోస్ట్!
Advertisement

Karnataka CM Post: కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఊహాగానాలు ఊపందుకుంటున్న తరుణంలో, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మైసూర్ విమానాశ్రయంలో నిర్వహించిన భేటీలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మంగళవారం మైసూర్ ఎయిర్‌పోర్ట్ రన్‌వే పై రాహుల్ గాంధీ.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్‌లతో విడివిడిగా సమావేశమయ్యారు. రాహుల్ గాంధీతో భేటీ జరిగిన మరుసటి రోజే (బుధవారం) డి.కె. శివకుమార్  ‘ఎక్స్’ (X) లో చేసిన ఒక పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

“ప్రయత్నం విఫలమైనా.. ప్రార్థన విఫలం కాదు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రకరకాల విశ్లేషణలకు తావిస్తున్నాయి. సీఎం పదవిపై తనకున్న ఆకాంక్షను గతంలోనే బహిరంగంగా ప్రకటించిన శివకుమార్, తాజా భేటీ తర్వాత ఈ విధంగా స్పందించడం గమనార్హం.

నాయకత్వ మార్పుపై ఉత్కంఠ

Advertisement

తమిళనాడు పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్తున్న క్రమంలో, మైసూర్‌లో విమానం ఆగిన సమయంలో రాహుల్ గాంధీ ఇద్దరు నేతలతో విడివిడిగా చర్చలు జరిపారు. ఈ భేటీల్లో ఏం జరిగిందనే దానిపై స్పష్టత లేనప్పటికీ, రాష్ట్రంలో నాయకత్వ మార్పు గురించే ప్రధానంగా చర్చ జరిగినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

‘రొటేషన్’ ఫార్ములా అమలయ్యేనా?

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన సమయంలో సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య సీఎం పీఠం కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఆ సమయంలో అధిష్టానం సిద్ధరామయ్య వైపు మొగ్గు చూపినప్పటికీ.. ‘రొటేషన్ ముఖ్యమంత్రి ఫార్ములా’ కింద రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్‌కు అవకాశం ఇస్తారనే ఒప్పందం కుదిరినట్లు వార్తలు వచ్చాయి.

Advertisement

మ‌రోవైపు సిద్ధరామయ్య, డి.కె. శివకుమార్ మధ్య నెలకొన్న నాయకత్వ వివాదాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే వారిని ఢిల్లీకి పిలిపిస్తామని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సోమవారం స్పష్టం చేశారు. “అవసరమైనప్పుడు పార్టీ వారిని పిలుస్తుంది” అని ఖర్గే విలేకరులతో పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో నాయకత్వంపై కొంత గందరగోళం ఉన్న మాట వాస్తవమేనని, అయితే స్థానిక నాయకత్వమే దీనిని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

అయితే మంగ‌ళ‌వారం రాహుల్ గాంధీతో జరిగిన ఈ తాజా భేటీలో నాయకత్వ మార్పుపై చర్చ జరిగిందా? లేదా కేవలం రాజకీయ పరిస్థితులపై సమీక్షించారా? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. రాహుల్ గాంధీ ఇద్దరు నేతలను విడివిడిగా కలవడాన్ని బట్టి చూస్తే, విభేదాలను పరిష్కరించే దిశగా హైకమాండ్ ఒక కచ్చితమైన నిర్ణయానికి వస్తున్నట్లు కనిపిస్తోంది. సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల కాలాన్ని సమీపిస్తున్న తరుణంలో, శివకుమార్ చేసిన “ప్రార్థన” ఫలిస్తుందో లేదో వేచి చూడాలి.

Read Also: రైలు పట్టాలపై గర్భిణీ ప్రసవం.. ఆ తర్వాత జరిగింది తెలిస్తే షాక్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×