E-Paper
Advertisement

Rahul Gandhi-Mallikarjun: జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో పర్యటించనున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ..

Rahul Gandhi-Mallikarjun: జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ లో పర్యటించనున్న.. ఖర్గే, రాహుల్ గాంధీ..
Advertisement

బుధవారం మధ్యాహ్నం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ జమ్మూకు చేరుకోనున్నారు. జమ్మూ, శ్రీనగర్‌లోని పార్టీ కీలక నేతలతో పాటు పార్టీ శ్రేణులతో కూడా ఖర్గే, రాహుల్ సమావేశం కానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎలక్షన్ లో పార్టీ విజయావకాశాల కోసం తీసుకోవాల్సిన చర్యలపై నేతలతో వారిరువురు చర్చించనున్నారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Advertisement

ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో పాటు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ శ్రీనగర్ భేటీ అవ్వనున్నారు. ఈ ఎలక్షన్ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఇతరపార్టీలతో జతకట్టే అవకాశం ఉన్నట్లు కేసీ వేణుగోపాల్ తెలిపారు. మరోవైపు నాలుగు రాష్ట్రాలు.. హరియాణ, మహారాష్ట్ర, జమ్మూ కశ్మీర్, జార్ఖండ్ అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

Also Read: నేడు భారత్‌ బంద్‌.. వాహనాలు రోడ్లపై రాకుండా అడ్డగింత!

Advertisement

ఈ నేపథ్యంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఇన్‌చార్జ్‌లు, స్ర్కీనింగ్ కమిటీ సభ్యులతో సోమవారం న్యూఢిల్లీలో రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే సమావేశమై చర్చించారు. ఇక జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎలక్షన్స్ 3 విడతల్లో జరగనుంది. అందులోభాగంగా తొలి విడత నోటిఫికేషన్ మంగళవారం ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 4న వెలువడనున్నాయి.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×