E-Paper
Advertisement

తమిళనాడులో యువత గెలిచింది.. విజయ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు!

తమిళనాడులో యువత గెలిచింది.. విజయ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు!
Advertisement

Rahul Gandhi: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కేరళలో ఘనవిజయం సాధించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ సంచలన ఫలితాలు నమోదు చేయడంపై కృతజ్ఞతలు తెలిపారు. కేరళలో వచ్చిన స్పష్టమైన తీర్పు ప్రజా ఆకాంక్షలకు నిదర్శనమని ఆయన కొనియాడారు.

కేరళ గెలుపుపై స్పందిస్తూ.. “స్పష్టమైన మెజార్టీని అందించిన కేరళలోని నా సోదర సోదరీమణులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ విజయం కోసం అహర్నిశలు శ్రమించిన ప్రతి యూడీఎఫ్ నాయకుడికి.. కార్యకర్తకు నా అభినందనలు. నేను గతంలో చెప్పినట్లే కేరళకు అద్భుతమైన ప్రతిభ.. అపారమైన సామర్థ్యం ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటిని సద్వినియోగం చేసుకునే దార్శనికత కలిగిన యూడీఎఫ్ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతోంది. త్వరలోనే నా కేరళ కుటుంబాన్ని కలుసుకోవడానికి వస్తున్నాను.” అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

Advertisement

మరోవైపు తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన టీవీకే అధినేత విజయ్‌కు రాహుల్ గాంధీ ఫోన్ చేసి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. “థిరు విజయ్‌తో మాట్లాడాను.. టీవీకే సాధించిన అద్భుతమైన ఫలితాలకు ఆయనను అభినందించాను. ఈ తీర్పు తమిళనాడులో పెరుగుతున్న యువత స్వరాన్ని ప్రతిబింబిస్తోంది. ఆ స్వరాన్ని ఎవరూ విస్మరించలేరు. తమిళనాడు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన కృషికి నా ధన్యవాదాలు. ప్రజల ప్రయోజనాలను రక్షించడంలో.. వారికి సేవ చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని మరోసారి స్పష్టం చేస్తున్నాను.” అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.

Advertisement

Read Also: విజయ్ చూపు ఎటు వైపు.. ప్రభుత్వ ఏర్పాటుకు కలిసేదెవరితో?

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×