E-Paper
Advertisement

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి
Advertisement

Rahul Gandhi: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నవారిని కేంద్ర ఎన్నికల సంఘం కాపాడుతోందంటూ ఆరోపించారు లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ. ఉద్దేశ పూర్వకంగా లక్షల ఓట్లను తొలగించిందని విమర్శలు గుప్పించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దఎత్తున ఓటు చోరీ జరిగిందని ఆరోపించారు. కేవలం ఆరోపణలు కాదని, పక్కా ఆధారాలతో చెబుతున్నానని వెల్లడించారు.

సాప్ట్‌వేర్, నకిలీ దరఖాస్తులతో ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లను వినియోగించారని అన్నారు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తాము కర్ణాటక ఈసీని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.

Advertisement

సూర్యకాంత్ వ్యక్తి గుర్తింపును దుర్వినియోగం చేసి 14 నిమిషాల్లో 12 నకిలీ ఓట్ల తొలగింపు ఫారమ్‌లను దాఖలు చేశారని ఆరోపించారు. కర్ణాటక సీఐడీ ఓట్ల తొలగింపు వివరాలు కోరినా ఈసీ స్పందించలేదన్నారు. మహారాష్ట్రలోని రాజురా అసెంబ్లీ నియోజకవర్గంలో 6851 ఫేక్ ఓట్లు కలిపారని వివరించారు.

ఢిల్లీలోని ఇందిరా భవన్‌ ఆడిటోరియంలో రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో కీలక విషయాలు బయటపెట్టారు. ‘ఓటు చోరీ’పై హైడ్రోజన్ బాంబ్ పేల్చుతానని ఇప్పటికే ప్రకటించారు రాహుల్ గాంధీ.  సెంట్రలైజ్డ్‌ వ్యవస్థ ద్వారా ఓట్లు డిలీట్‌ చేస్తున్నారని దుయ్యబట్టారు. ఓట్లు తొలగించేందుకు కొందరు వ్యవస్థను హైజాక్‌ చేస్తున్నారని, మాకు ఓట్ల తొలగింపు ఐడీలు, OTP వివరాలు ఇవ్వాలన్నారు.

Advertisement

ALSO READ: మోదీ@ పిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు

ఒకప్పుడు కర్ణాటకలో ఈసీగా ఉన్న ఆయన ప్రస్తుతం ఢిల్లీలో సీఈసీలో ఉన్నారన్నారు. కాంగ్రెస్‌ బూత్‌లను కేవలం టార్గెట్‌ చేశారని రుసరుసలాడారు. ఈ అంశంపై కోర్టుకు వెళతారా అని మీడియా ప్రశ్నించింది. ప్రజలకు సత్యాన్ని చూపించడమేనని తన పని అని, అదే చేస్తున్నానని పష్టంగా చెప్పారు రాహుల్‌గాంధీ.

ఉద్దేశపూర్వకంగా లక్షలాది ఓటర్లను తొలగించారని ధ్వజమెత్తారు. నకిలీ ఓట్లకు లింక్‌ చేసినవన్నీ ఫేక్‌ ఫోన్‌ నెంబర్లని, ఆయా నెంబర్లకు కాల్‌ చేస్తే పని చేయలేదన్నారు.  కాంగ్రెస్‌కు బలం ఉన్న చోట ఓట్లు తొలగించారని, తాను చెబుతున్నవన్నీ ఆరోపణలు కాదన్నారు. ముమ్మాటికీ వాస్తవాలని, చాలా చోట్ల మైనారిటీలు, ఆదివాసీల ఓట్లు తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

సాప్ట్‌వేర్, నకిలీ దరఖాస్తులతో ఓట్ల చోరీ జరిగిందన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల ఫోన్ నెంబర్లను వినియోగించారని అన్నారు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్లు ఎవరివి? వాటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై తాము కర్ణాటక ఈసీని ప్రశ్నించినా ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు.

దేశంలో చట్టపరమైన సంస్థలు చాలా ఉన్నాయని, ఈ విషయాన్ని వారంతా పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను రక్షించడం తమ పని కాదని, ఆ సంస్థల పని అని చెప్పారు. కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, యూపీ వంటి రాష్ట్రాల్లో ఓట్లు తొలగిస్తోందన్నారు. ఓటు చోరికి ఇదొక ఉదాహరణగా చెప్పారు. వీటిపై వారంలోపు CEC  వివరాలు ఇవ్వాలన్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×