E-Paper
Advertisement

Rahul Gandhi: అవును.. ఆ ఎన్నికల్లో అవకతవకలు, 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరారు?

Rahul Gandhi: అవును.. ఆ ఎన్నికల్లో అవకతవకలు,  39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేరారు?
Advertisement

Rahul Gandhi: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముమ్మాటికీ అవకతవకలు జరిగాయని కుండ బద్దలు కొట్టారు. దీనికి సంబంధించి కీలక విషయాలు బయటపెట్టారు. 39 లక్షల ఓటర్లు ఎలా చేరారంటూ ప్రశ్నలు లేవనెత్తారు.

మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమిపై కొత్త ప్రశ్నలు లేవనెత్తారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ. మహారాష్ట్రలో లోక్‌సభ – అసెంబ్లీ ఎన్నికల మధ్య సమయంలో దాదాపు 39 లక్షల కొత్త ఓటర్లు ఎలా చేశారంటూ ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ను ప్రశ్నించారు. కొత్తగా చేరిన ఆ 39 లక్షల మంది ఓటర్లు ఎవరు? ఈ సంఖ్య హిమాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రం మొత్తం ఓటర్ల సంఖ్యతో సమానమన్నారు.

Advertisement

లోక్‌సభ ఎన్నికల్లో మాకు వచ్చిన ఓట్లకు, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లకు తేడా లేదన్నారు రాహుల్‌గాంధీ. కానీ ఎన్డీఏ కూటమి పార్టీలకు అదనంగా ఓట్లు వచ్చి చేరాయన్నారు. ఆ ఓట్లే ఎన్డీయే పార్టీలకు విజయాన్ని అందించాయని ఎక్స్ వేదికగా ప్రస్తావించారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఎందుకు మార్చారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తారు. పార్లమెంట్‌లో ఈ అంశాన్ని తాను లేవనెత్తినప్పటికీ ఈసీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదని రాసుకొచ్చారు. ఈ విషయంలో తాను ఎలాంటి ఆరోపణలు చేయలేదని, గణాంకాలు, డేటా ముందు పెట్టి సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నానని మనసులోని మాట బయటపెట్టారు.

Advertisement

ALSO READ: మాజీ సీఎం ఎడ్యూరప్పకు రిలీఫ్, బెయిల్ ఓకే.. కాకపోతే

ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానికి ఉందని గుర్తు చేశారు లోక్‌సభలో ప్రతిపక్ష నేత. మాకు ఓటర్ల జాబితా, వారి ఫొటోలు, చిరునామాలు అందించాలని ఎన్నికల కమిషన్‌ను డిమాండ్ చేశారు. ఇదంతా ఒకెత్తయితే చాలా చోట్ల దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన ఓటర్ల పేర్లను తొలగించారని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన ఆయా అంశాలపై మహారాష్ట్ర ఎన్నికల సంఘం ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×