// // Tamilnadu Politics: తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి దిగే -->
E-Paper
Advertisement

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

తమిళనాడులో బైపోల్ సందడి, టీవీకే తరపున రాఘవ లారెన్స్‌, తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు
Advertisement

Tamilnadu Politics: తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తాజాగా తిరుచ్చి తూర్పు నుంచి నటుడు, సామాజిక కార్యకర్త రాఘవ లారెన్స్ బరిలోకి దిగుతున్నట్లు వార్తలు జోరుగా సాగుతున్నాయి. టీవీకే పార్టీ నుంచి ఆయన బరిలోకి దిగే అవకాశముందని జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో మిత్రపక్షాలు అలర్ట్ అయ్యాయి.

తమిళనాడులో మొదలైన బైపోల్ సందడి

Advertisement

తమిళనాడు రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. టీవీకే పార్టీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా డీఎంకే పార్టీ వ్యవహరిస్తోంది. ఇప్పటికే డీఎంకే అధినేత స్టాలిన్ చెప్పినట్టే మిత్రపక్షాలు వింటున్నాయి. తాజాగా మరొక కొత్త వార్త వెలుగులోకి వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఖాళీ చేసిన తిరుచిరాపల్లి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోనని తేల్చి చెప్పారు వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్.

ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. మంగళవారం వీసీకే అధినేత ఓ ప్రకటన చేశారు. తాను ఉప ఎన్నికలో పోటీ చేయనని, ఎవరి ప్రభావానికీ లోనుకానని స్పష్టంచేశారు. విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తనకు అవకాశం, గెలిచిన తర్వాత మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisement

టీవీకే తరపున రాఘవ లారెన్స్‌..  తిరుచ్చి నుంచి రేసులో చాలామంది నేతలు

బైపోల్‌లో పోటీ చేసేందుకు తాను తిరస్కరించానని, ఈ ప్రతిపాదన చేసినందుకు ముఖ్యమంత్రి విజయ్‌కి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ఈ సీటు నుంచి టీవీకే తన అభ్యర్థి బరిలోకి దించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎవర్ని రంగంలోకి దించాలని ఆలోచన సమయంలో నటుడు, సామాజిక కార్యకర్త రాఘవ లారెన్స్ పేరు వెలుగులోకి వచ్చింది.

తమిళగ వెట్రి కజగం-టీవీకే పార్టీ తరపున తిరుచ్చి తూర్పు ఉప ఎన్నికకు ఆయన్ని అభ్యర్థిగా పరిగణిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కీలక నియోజకవర్గాల్లో తమ ఉనికిని బలోపేతం చేసుకోవడానికి టీవీకే ప్రముఖులను అన్వేషిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో తిరుచి తూర్పు నియోజకవర్గం నుంచి లారెన్స్ పేరు తెరపైకి వచ్చింది.

ALSO READ: టీఎంసీలో సంక్షోభం.. బీజేపీతో టచ్‌లో 20 మంది ఎంపీలు, కమిటీలన్నీ రద్దు 

ఇది రాజకీయ వ్యూహంలో భాగమా? కేవలం ప్రచారంలో ఉన్న వదంతా? లారెన్స్ తన ఫౌండేషన్ పనులతో ఎప్పుడూ సామాజిక సేవకుడిగా బిజీగా ఉంటాడు. టీవీకే ద్వారా ఎన్నికల రాజకీయాల్లోకి రావడం ఒక పెద్ద ముందడుగులా అనిపిస్తోంది. ఇది కేవలం సోషల్ మీడియాలో వ్యాపించిన మరో వదంతా? అనేదానిపై తమిళ ప్రజలు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

మారుతున్న రాజకీయాల నేపథ్యంలో ఏమైనా జరగవచ్చని అంటున్నారు. తమిళనాడు రాజకీయాలు గతంలో కూడా మనల్ని ఆశ్చర్యపరిచాయని అంటున్నారు. మొత్తానికి టీవీకే పార్టీ తరపున బరిలోకి దిగేందుకు చాలామంది ప్రముఖులు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×