E-Paper
Advertisement

DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?

DNA Test: బిచ్చగాళ్లకు DNA టెస్ట్ లు, పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎందుకో తెలుసా?
Advertisement

చాలా చోట్ల బిచ్చగాళ్లు చిన్న చిన్న పిల్లల్ని ఎత్తుకుని భిక్షాటన చేస్తూ కనపడతారు. బిడ్డకు పాలు లేవు డబ్బులివ్వండి అంటూ కనపడినవారినల్లా ప్రాధేయపడతారు. ఇంకొంతమంది బిడ్డకు ఆరోగ్యం బాగోలేదు, ఆస్పత్రికి తీసుకెళ్లాలి డబ్బులు కావాలంటారు. ఇలా బిడ్డల సింపతీని అడ్డు పెట్టుకుని చాలామంది భిక్షాటన చేస్తుంటారు. ఇలాంట వారిలో నిజంగా అవసరం ఉన్నవారు లేరని చెప్పలేం కానీ, ఆ అవసరాన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు సంపాదించేవారే ఎక్కువమంది కనపడతారు. అయితే ఆ చిన్నారులు వారి పిల్లలేనా, వారితో రక్త సంబంధం ఉన్నవారేనా..? అనే అనుమానాలు రాకమానవు. చిన్నారులను కిడ్నాప్ చేసే బిచ్చగాళ్ల ముఠాలకు సరఫరా చేసే కేటుగాళ్లు కూడా అక్కడక్కడ పోలీస్ రికార్డుల్లో నమోదవుతుంటారు. ఈ నేపథ్యంలో బిచ్చగాళ్ల మాఫియాకు చెకె పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది పంజాబ్ ప్రభుత్వం. బిచ్చగాళ్లకు, వారి చేతిలోని పిల్లలకు డీఎన్ఏ టెస్ట్ లు చేయడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేస్తోంది.

భిక్షాటన లేని రాష్ట్రంగా పంజాబ్ ని తీర్జిదిద్దాలని చూస్తోంది అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వం. ఎన్నికల్లో కూడా ఈమేరకు హామీ ఇచ్చారు నేతలు. అయితే ఇప్పుడు ఆ హామీని అమలులో పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. బిచ్చగాళ్లు లేని రాష్ట్రం అంటే వారందరికీ గౌరవప్రదమైన ఉపాధి చూపించే రాష్ట్రం అని చెప్పుకోవాలి. మిగతా వారిని ఆ వృత్తిలోకి రాకుండా అడ్డుకోవడంతోపాటు, నిరుపేదలు భిక్షాటనవైపు మళ్లకుండా వారికి సౌకర్యాలు కల్పించాలి. ఇదంతా చేయడం అసాధ్యం అనేవారు కూడా ఉన్నారు. అయితే తమకు ఉన్న వనరుల్లో కనీసం బిచ్చగాళ్ల సంఖ్యను పూర్తిగా తగ్గించేందుకు పంజాబ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పసిపిల్లల అక్రమ రవాణాను అరికట్టే దిశగా తొలి అడుగు వేసింది.

Advertisement

చేతిలో పిల్లలతో రోడ్లపైకి వచ్చే బిచ్చగాళ్లను ముందుగా అధికారులు గుర్తిస్తారు. అసలు ఆ పిల్లలకు వారిని ఎత్తుకుని తిప్పే వారికి సంబంధం ఉందా లేదా అని ఆరా తీస్తారు. తప్పు ఒప్పుకుంటే సరేసరి లేదంటే డీఎన్ఏ టెస్ట్ కి సిద్ధం కావాలని చెబుతారు. డీఎన్ఏ మ్యాచ్ కాకపోతే ఆ పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లకు తరలిస్తారు. ఇలా పిల్లల్ని బిచ్చగాళ్ల వలనుంచి విడిపించేందుకు పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు బిచ్చగాళ్ల సంఖ్యను తగ్గించేందుకు కూడా ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని అంటున్నారు అధికారులు.

భిక్షాటన చేస్తున్న పిల్లలకు, వారి వెంటనున్న పెద్దలకు సంబంధం లేదని డీఎన్‌ఏ పరీక్షల్లో తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. అక్రమ మార్గాల్లో పిల్లలను తీసుకొచ్చిన వారిని జైలుకు పంపిస్తామని అంటున్నారు. బాలల అక్రమ రవాణాను అడ్డుకోవడమే దీని లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా దీన్ని ప్రారంభిస్తోంది. బిచ్చగాల్లకు డీఎన్‌ఏ పరీక్షలు చేయాలని ఐదు జిల్లాల అధికారులకు పంజాబ్ ప్రభుత్వం ఆదేశించింది. దీని ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. ఐదు జిల్లాల్లో ఆశించిన ఫలితాలు వస్తే మొత్తం రాష్ట్రమంతా ఈ కార్యక్రమాన్ని చేపడతారు. ఇది ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలిచే అవకాశముంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×