E-Paper
Advertisement

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే?

Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ చేయకపోవడానికి కారణం ఏంటంటే?
Advertisement

Priyanka Gandhi: లోక్ సభ ఎన్నికల్లో తాను ఎందుకు పోటీ చేయలేదనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వివరణ ఇచ్చారు. దేశ వ్యాప్తంగా పార్టీ తరపున ప్రచారం చేసేందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. సోదరుడు రాహుల్ గాంధీతో పాటు తాను కూడా పోటీ చేస్తే  బీజేపీకి లాభం చేకూరుతుందని ప్రియాంక గాంధీ అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు అంశాలకు సంబంధించి వివరణ ఇచ్చారు.

గత 15 ఏళ్లుగా తాను రాయ్ బరేలీలో ప్రచారం చేస్తున్నానని ప్రియాంక గాంధీ చెప్పారు. గాంధీ కుటుంబానికి రాయ్ బరేలీతో ఎంతో అనుబంధం ఉందన్నారు. అందుకే తాము ప్రజలతో కలిసి మాట్లాడాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. రిమోట్ కంట్రోల్ ద్వారా రాయ్ బరేలి ఎన్నికలను గెలవలేరని ఎద్దేవా చేశారు.

Advertisement

తాను లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే కనీసం 15 రోజులు తన నియోజకవర్గంలో ప్రచారం చేసుకునేందుకు సమయం కేటాయించాల్సి వచ్చేదని తెలిపారు. అప్పుడు దేశమంతా ప్రచారం చేయడానికి వీలు ఉండేది కాదని అన్నారు. అయితే భవిష్యత్తులో పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే ఎన్నికల్లో పోటీ చేయాలని తాను ఎప్పుడూ అనుకోలేదని ప్రియాంక గాంధీ చెప్పారు. పార్టీ కోసం ప్రజలు తాను ఏది చేయాలని కోరితే అదే చేస్తానని తెలిపారు. తాను ఎన్నికల్లో పోటీ చేయాలని అనుకుంటే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Also Read: భావోద్వేగానికి గురైన రాహుల్ గాంధీ

మరో వైపు అమేథీ, రాయ్ బరేలీలో పోటీ నుంచి పారిపోతున్నారంటూ బీజేపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఆమె స్పందించారు. అమేథీ, రాయ్ బరేలీలను కాంగ్రెస్ వదిలి పెట్టదని తెలిపారు. గుజరాత్ లోని వడోదరలో మోదీ ఎందుకు పోటీ చేయడం లేదని ప్రియాంక ప్రశ్నించారు. గుజరాత్ నుంచి ఆయన పారి పోయారా అని అన్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×