E-Paper
Advertisement

Bus Accident : ఒడిశాలో బస్సు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి

Bus Accident : ఒడిశాలో బస్సు ప్రమాదం.. ముగ్గురు హైదరాబాదీలు మృతి
Advertisement

Bus Accident in Odisha(Today latest news telugu): ఒడిశా రాష్ట్రంలో సుమారు 40 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక మహిళతో సహా ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 12 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ నుంచి గయాకు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. మయూర్ భంజ్ జిల్లా బెత్నాటి పోలీస్ స్టేషన్ పరిధిలోని బుధిఖమర్ చౌక్ సమీపంలో శనివారం ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. బస్సు వెనుక నుంచి ఆగి ఉన్న ట్రక్కు ఢీ కొట్టడంతో ముగ్గురు ప్రయాణికులు మరణించారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.

Advertisement

ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులు బస్సును సీజ్ చేసి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.

 

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×