E-Paper
Advertisement

Delhi High Court: ఓరి వీడమ్మ బడవా..! ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో..?

Delhi High Court: ఓరి వీడమ్మ బడవా..! ఖైదీ కోరిక విని షాకైన ఢిల్లీ కోర్టు.. ప్రియురాలితో..?
Advertisement

Prisoner Applied Parole for Live-in-Lover: ఒక కేసులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్న ఖైదీ కోరిన కోరికను విని.. ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం షాకైంది. ఇటీవల అతను పెరోల్ కు అప్పీల్ చేసుకోగా.. అందుకు గల కారణాన్ని విని జడ్జి షాకయ్యారు. అతనికి ఇప్పటికే భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయినా.. తనకు ఒక లవర్ ఉందని, ఆమెతో పిల్లల్ని కనాలని ఉందని, అందుకోసం తనకు పెరోల్ ఇవ్వాలని పిటిషన్ లో పేర్కొన్నాడు. ఖైదీ దాఖలు చేసిన ఈ పిటిషన్ ను న్యాయమూర్తి స్వర్ణకాంత శర్మ తిరస్కరించారు.

ఇండియన్ పీనల్ కోడ్, జైలు నియమాలు ఇలాంటి అభ్యర్థనకు పెరోల్ ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేశారు జడ్జి. భార్య ఉండగా లివ్ ఇన్ భాగస్వామితో.. ఇలాంటి వివాహేతర సంబంధాలను పెట్టుకోవడాన్ని చట్టం అస్సలు ఒప్పుకోదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ బంధం ఉన్న భార్యను కలవడానికే చట్టం పెరోల్ అనుమతించదని, అలాంటిది లివ్ ఇన్ పార్ట్ నర్ ను కలిసేందుకు పెరోల్ ఎలా ఇస్తామని అడిగారు.

Advertisement

Also Read: Minor Assault : మైనర్ పై గ్యాంగ్ రేప్.. పేట్రేగిపోయిన నీచులు

పిటిషన్ దారైన ఖైదీ.. పెళ్లి చేసుకుని భార్య ఉండగానే.. మరొకరితో సహజీవనం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఆమెతో పిల్లల్ని కనేందుకే పెరోల్ ను అడగడం చర్చనీయాంశమైంది. భార్యకు విడాకులు ఇవ్వకుండా.. మరొక వ్యక్తితో ఉండటం తప్పని పేర్కొన్న కోర్టు.. పెరోల్ ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. పెళ్లి కాకముందు లివ్ ఇన్ లో ఉండటం తప్పుకాదన్న కోర్టు.. పెళ్లయ్యాక భాగస్వామిని మోసం చేసి మరొక వ్యక్తితో సహజీవనం చేయడం తప్పేనని పేర్కొంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×