E-Paper
Advertisement

Pregnant Woman safe: అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ

Pregnant Woman safe: అంబులెన్స్‌లో మంటలు.. తృటిలో తప్పించుకున్న ఓ గర్బిణీ
Advertisement

Pregnant Woman safe: మహారాష్ట్రలో ఓ గర్భిణీ మహిళ, ఆమె కుటుంబ సభ్యులు క్షణంలో తప్పించుకున్నారు. గర్భిణీని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకువెళుతున్న క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. అసలేం జరిగిందన్న డీటేల్స్‌లోకి వెళ్దాం.

మహారాష్ట్ర జల్గావ్ జిల్లాలోని ఓ ప్రాంతం నుంచి ప్రెగ్నెంట్ మహిళను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలిస్తున్నారు. అయితే అంబులెన్స్ దాదావాడి సమీపంలోని జాతీయ రహదారిపైకి రాగానే ప్రమాదం చోటు చేసుకుంది.

Advertisement

వేగంగా వెళ్తున్న అంబులెన్స్ ఇంజిన్ నుంచి కొద్దికొద్దిగా పొగలు రావడాన్ని డ్రైవర్ గమనించారు. వాహనాన్ని ఆపి అంబులెన్స్‌లో ప్రెగ్నెంట్ మహిళ, ఆమె బంధువులను దించి కొంతదూరం వెళ్లాలని కోరాడు. క్షణాల వ్యవధిలో అంబులెన్స్ ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి.

ఆ తర్వాత అందులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్ పేలింది. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. అంబులెన్స్ పేలుడు ధాటికి సమీపంలో ఇళ్ల అద్దాలు కూడా పగిలిపోయినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement

ALSO READ: ఏటీఎం సెంటర్ కు వచ్చిన వరాహం.. జెట్ స్పీడ్ తో వచ్చి.. తన పని కానిచ్చేసింది.. ఏం జరిగిందంటే?

అంబులెన్స్ రోడ్డుపై వెళ్తున్న క్రమంలో సమీపంలో కొందరు యువకులు దీన్ని షూట్ చేశారు. దీనికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఘటన తర్వాత  మరో అంబులెన్స్‌లో ప్రెగ్నెంట్ మహిళను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×