E-Paper
Advertisement

Patna: రైల్వే స్టేషన్‌ టీవీల్లో పోర్న్ వీడియోలు.. ప్రయాణికులు షాక్

Patna: రైల్వే స్టేషన్‌ టీవీల్లో పోర్న్ వీడియోలు.. ప్రయాణికులు షాక్
Advertisement

Patna: రైల్వే స్టేషన్స్, బస్‌స్టాండ్స్‌లో ఎక్కువగా ప్రకటనలు ఇస్తుంటారు. స్టేషన్‌కు వెళ్లగానే టీవీల్లో, మల్టీ స్క్రీన్లపై యాడ్స్ ప్లే చేస్తుంటారు. ఎందుకంటే నిత్యం అక్కడికి జనాలు వస్తూ.. పోతూ.. ఉంటారు కాబట్టి. అయితే ఓ రైల్వే స్టేషన్‌లోని టీవీల్లో యాడ్స్‌కు బదులుగా పొరపాటున పోర్న్ వీడియోలను ప్లే చేశారు. దీంతో ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ ఘటన బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో జరిగింది.

ఆదివారం ఉదయం పాట్నా రైల్వే స్టేషన్ ప్రయాణికులతో రద్దీగా ఉంది. ఇంతలోనే 10వ ప్లాట్‌ఫామ్‌పై ఉన్న టీవీల్లో ఒక్కసారిగా పోర్న్ వీడియోలు ప్లే అయ్యాయి. ప్రకటనలు రావాల్సిన స్థానంలో దాదాపు మూడు నిమిషాల పాటు పోర్న్ వీడియోలు ప్రసారం అయ్యాయి. వెంటనే ప్రయాణికులు రైల్వే అధికారులు ఫిర్యాదు చేశారు.

Advertisement

అధికారులు సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి వీడియోలు నిలిపివేశారు. ఆ తర్వాత సంబంధిత కాంట్రాక్టర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. అలాగే అతని కాంట్రాక్ట్‌ను కూడా రద్దు చేసి, జరిమానా విధించారు. సాంకేతిక లోపం వల్లే పోర్న్ వీడియోలు ప్లే అయినట్లు అధికారులు నిర్దారణకు వచ్చారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×