E-Paper
Advertisement

వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు, మాజీలకు పెంపు, ఆ ఉద్దేశం లేదన్న స్టాలిన్

వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు, మాజీలకు పెంపు, ఆ ఉద్దేశం లేదన్న స్టాలిన్
Advertisement

Chennai: తమిళనాడులో రాజకీయాలు గంట గంటకూ ఉత్కంఠగా మారుతున్నాయి. పార్టీలు తమ ఎమ్మెల్యేలను రిసార్ట్స్ తరలించడం మొదలుపెట్టారు. ఇదే సమయంలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీవీకే అధినేత విజయ్‌కు భద్రత కుదించారు. మరోవైపు మాజీ సీఎంలు స్టాలిన్-పళనిస్వామికి భద్రత పెంచారు.

వేడెక్కిన తమిళనాట రాజకీయాలు.. విజయ్‌కు భద్రత కుదింపు

Advertisement

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పును డీఎంకె, అన్నాడీఎంకె పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి. కొత్తగా వచ్చిన టీవీకే పార్టీని ప్రజలు ఆదరించడం ఆ పార్టీలకు ఏమాత్రం మింగుడుపడడం లేదు. బుధవారం అంతా చెన్నైలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి.

టీవీకే పార్టీ మద్దతు ఇస్తామంటూ అన్నాడీఎంకెకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకోవడం మొదలైంది. ఎప్పుడైతే గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటుకు టీవీకే పార్టీకి ససేమిరా అన్నారో, వెంటనే డీఎంకె-అన్నాడీఎంకె పార్టీలు అలర్ట్ అయ్యాయి. దీంతో రాత్రంతా ఆ పార్టీ నేతలు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

Advertisement

మాజీ సీఎంలకు పెంపు,  కీలక వ్యాఖ్యలుచేసిన స్టాలిన్

ఈ నేపథ్యంలో టీవీకే చీఫ్‌ విజయ్‌‌కు ఇంటి వద్ద, ఆయనకు భద్రతను అమాంతంగా తగ్గిపోయింది.  స్పష్టమైన మెజార్టీ వచ్చిన తర్వాత అధికార భద్రత స్వీకరిస్తానన్న విజయ్ అన్నట్లు తెలుస్తోంది. సీఎం హోదా అధికారికంగా ఖరారైన తర్వాతే సెక్యూరిటీ తీసుకుంటానని స్పష్టం చేసినట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా విజయ్ కాన్వాయ్‌లోని పోలీస్ కాన్వాయ్‌ కనిపించలేదు. కేవలం వ్యక్తిగత భద్రతా సిబ్బంది మాత్రమే కనిపించారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రులు స్టాలిన్, పళనిస్వామిలకు భద్రత పెంచడం ఆసక్తికరంగా మారింది.

అదే సమయంలో డీఎంకె, అన్నాడీఎంకె నేతల ప్రకటనలు వేర్వేరుగా ఉన్నాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్టీ అధికారంలోకి రావాలన్న ప్రజా తీర్పును మా పార్టీ గౌరవిస్తుందన్నారు. ఈ విషయంలో డీఎంకే ఏ విధంగా అడ్డుపడదని తేల్చేశారు. మరోసారి ఎన్నికలు జరగడం, రాజ్యాంగ సంక్షోభం తలెత్తడం తాము కోరుకోలేదన్నారు.

ALSO READ: విజయ్ సేనాని ముందు ‘అగ్నిపరీక్ష’.. రేపటితో ముగియనున్న డెడ్‌లైన్!

ప్రజలు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని తేల్చేశారు. ఈ నేపథ్యంలో వస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు. అన్నాడీఎంకేతో కలిసి డీఎంకే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, ప్రజలు మార్పు కోరుకున్నారని చెప్పుకొచ్చారు.

దీంతో తమిళనాట రాజకీయాల్లో నెల కొన్న ఊహాగానాలకు కాస్త తెరపడినట్లయ్యింది. ఈ వ్యవహారంపై అన్నాడీఎంకే నోరు విప్పింది. విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చేదిలేదని తేల్చేసింది. పార్టీ చీఫ్ ఈపీఎస్ ఆమోదంతో ఈ విషయం చెబుతున్నానని ఆ పార్టీ సీనియర్ నేత కేపీ మునుసామి తెలియజేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×