E-Paper
Advertisement

ASSEMBLY ELECTIONS : మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..

ASSEMBLY ELECTIONS :  మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం..
Advertisement

ASSEMBLY ELECTIONS : మిజోరాం, ఛత్తీస్‌గడ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమయ్యింది. మిజోరాంలోని 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలో మొత్తం 90 నియోజకవర్గాలకు గాను నేడు 20 స్థానాల్లో పోలింగ్ జరగనుంది.

ఈ 20 కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 7 జిల్లాల్లో జరగనుంది. ఛత్తీస్‌గఢ్‌‌లో ఇవాల జరుగుతున్న 20 స్థానాల్లో 12 స్థానాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన బస్తర్‌లోనే ఉన్నాయి. దీంతో.. 40 వేల మంది సీఆర్‌పీఎఫ్, 20 వేల మంది రాష్ట్ర పోలీసులతో కలిపి మొత్తం 60 వేల మంది భద్రతా సిబ్బంది రంగంలోకి దించారు. డ్రోన్లు, హెలికాప్టర్లతో నిఘా ఏర్పాట్లు చేశారు.

Advertisement

తొలి విడతలో 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. నేడు జరగబోయే 20 స్థానాల పోలింగ్ బరిలో బీజేపీ మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో 3 గంటలకే పోలింగ్ ముగుస్తుందని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ తెలిపారు. మిగతా ప్రాంతాల్లో పోలింగ్ 5 గంటల వరకు కొనసాగుతుంది అని తెలిపారు. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17న పోలింగ్ జరగనుంది.

Advertisement

ఇక మిజోరం విషయానికి వచ్చినట్టైతే.. 174 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 8 లక్షల 57 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 12వందల 76 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది.

డిసెంబర్ ౩న ఫలితాలు ప్రకటించనున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×