E-Paper
Advertisement

PM WANI: ఉచిత ఇన్ స్టాలేషన్ తో రూ.150కే వైఫై.. పీఎం వాణి పథకం గురించి తెలుసా?

PM WANI: ఉచిత ఇన్ స్టాలేషన్ తో రూ.150కే వైఫై..  పీఎం వాణి పథకం గురించి తెలుసా?
Advertisement

PM WANI: వైఫైకి రూ.1000-రూ.2000 చెల్లిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం ఉచిత ఇన్ స్టాలేషన్ తో నెలకు రూ.150కి వైఫై సదుపాయం పొందవచ్చు. మీ వైఫై అదనపు డేటాను విక్రయించి ఆదాయం పొందవచ్చు. PM-WANI పథకం ద్వారా తక్కువ ధరకు వైఫై సదుపాయంతో పాటు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం కల్పిస్తుంది.

పీఎం-వాణి ప్రత్యేకతలు

  • రూ.150 నుండి ప్రారంభమయ్యే Wi-Fi ప్రణాళికలు
  • ఫైబర్ ఇన్‌స్టాలేషన్ అవసరం లేదు
  • పీడీవోగా రిజిస్టర్ చేసుకుంటే అదనపు ఆదాయం
  • చిన్నషాపులు, కేఫ్‌లు, లైబ్రరీలు, విద్యార్థులకు పర్ఫెక్ట్
  • ప్రభుత్వ మద్దతు, 100% చట్టబద్ధం
  • 7 రోజుల్లో యాక్టివేషన్

డిజిటల్ విప్లవంలో భాగంగా కేంద్రం పీఎం-వాణి (https://pmwani.gov.in/wani)స్కీమ్ ను అమలు చేస్తుంది. అందరికీ ఇంటర్నెట్ యాక్సెస్‌ లక్ష్యంతో ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. డబ్బు ఆదాతో పాటు డిజిటల్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ఇది సాహయపడుతుంది. ఖరీదైన Wi-Fi లపై డబ్బులు వృధా చేసుకునే కంటే దీనిని ఉపయోగించవచ్చు.

పీడీఓ సదుపాయం

Advertisement

PM-WANI లో పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO) వైఫై రౌటర్ ఉంటుంది. ఏదైనా పీడీఓఏ సహకారంతో సబ్‌స్క్రైబర్‌లకు బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించవచ్చు. సర్టిఫైడ్ పీడీఓఏ జాబితా PM-WANI సెంట్రల్ రిజిస్ట్రీలో అందుబాటులో ఉంది. పీడీఓఏ, ఏపీపీ ప్రొవైడర్లు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఈ సర్వీసును పొందడానికి పీడీఓలు సర్టిఫైడ్ పీడీఓఏతో సంప్రదించి వైఫై రూటర్, టీఎస్పీ/ఐఎస్పీ నుండి బ్రాడ్‌బ్యాండ్ /ఎఫ్టీటీహెచ్ కనెక్షన్‌ను కొనుగోలు చేయాలి.

పీఎం వాణి స్కీమ్

పీఎం వాణి పథకం ద్వారా వైఫై యూజర్లు వారి వైఫై నెట్‌వర్క్‌ను ఇతరులకు షేర్ చేసి ఆదాయం పొందొచ్చు. మీ ఇల్లు లేదా దుకాణంలో వై-ఫై ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే.. మీరు దాన్ని ప్రభుత్వ రిజిస్టర్ సిస్టమ్‌తో కనెక్ట్ చేసుకోవాలి. తద్వారా మీ డేటాను విక్రయించుకోవచ్చు.

Advertisement

Also Read: Panna News: ఇది కదా అదృష్టం అంటే.. గనిలో తవ్వకాలు జరుపుతుంటే.. క్వాలిటీ వజ్రం లభ్యం

కమీషన్ రూపంలో ఆదాయం

డిజిటల్ ఇండియా మిషన్ లో భాగంగా భారత టెలికాం శాఖ ఈ పథకాన్ని దేశవ్యాప్తంగా ప్రారంభించింది. మీకు రౌటర్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే పబ్లిక్ డేటా ఆఫీస్ (PDO)గా కింద మీ వివరాలను ప్రభుత్వ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మీ నెట్‌వర్క్ పబ్లిక్ వైఫైగా యాక్టివేట్ చేసుకోవచ్చు. తద్వారా సాధారణ ప్రజలు మీ నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసుకుంటారు. అలా మీ డేటా యూసేజ్ ను బట్టి మీకు కమీషన్ వస్తుంది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×