E-Paper
Advertisement

Narendra Modi Record: మరో అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రధాని మోదీ

Narendra Modi Record: మరో అరుదైన మైలురాయిని చేరుకున్న ప్రధాని మోదీ
Advertisement

Narendra Modi Record: భారత రాజకీయ చరిత్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో అరుదైన, చారిత్రాత్మక మైలురాయిని చేరుకున్నారు. సుదీర్ఘకాలం పాటు ప్రభుత్వ అధిపతిగా (ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి) సేవలందించిన భారతీయ నేతగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు. ఎక్కడా విరామం లేకుండా వరుసగా 8,931 రోజుల పాటు అధికారంలో కొనసాగడం ద్వారా ఈ రికార్డ‌ను న‌మోదు చేశారు. ఇప్పటివరకు సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్ పేరిట ఉన్న 8,930 రోజుల రికార్డును మోదీ అధిగమించారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఒక నాయకుడు ఇన్నేళ్లపాటు నిరంతరాయంగా పాలన సాగించడం దేశ చరిత్రలో ఇదే మొదటిసారి.

2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానం కీలక మలుపు తిరిగింది. అప్పటి నుండి 2014 వ‌ర‌కు సుమారు 13 ఏళ్ల పాటు గుజరాత్ సీఎంగా రికార్డు స్థాయి సేవలు అందించారు. ఆ అనుభవంతోనే 2014లో ఎన్డీయే త‌ర‌పున ప్ర‌ధానిగా బాధ్యతలు చేపట్టి, నేటి వరకు ప్రధానిగా కొనసాగుతున్నారు. గుజరాత్‌కు అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన వ్యక్తిగానే కాకుండా, ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉండి ప్రధానమంత్రి అయిన నేతగా కూడా ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు.

Advertisement

భార‌త్ కు స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత‌ జన్మించి, అత్యధిక కాలం దేశ ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన కాంగ్రెసేతర తొలి నేత నరేంద్ర మోదీయే కావడం గమనార్హం. కేంద్రంలో రెండు పూర్తి పదవీకాలాలను విజయవంతంగా ముగించి, వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన ఏకైక కాంగ్రెసేతర ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు. 2014, 2019, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తన పార్టీని వరుస విజయాల బాటలో నడిపించడం ద్వారా, గతంలో జవహర్‌లాల్ నెహ్రూ నెలకొల్పిన రికార్డును ఆయన సమం చేశారు.

గతేడాది జూలైలోనే మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రికార్డును అధిగమించి, దేశంలో అత్యధిక కాలం పనిచేసిన రెండో ప్రధానిగా మోదీ నిలిచారు. అలాగే, వరుసగా ఆరు ఎన్నికల్లో (మూడు అసెంబ్లీ, మూడు లోక్‌సభ) ఒక పార్టీ పక్ష నేతగా ఉండి విజయం సాధించిన ఏకైక నేతగా ఆయన నిలిచారు. 2002, 2007, 2012 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో మొదలైన ఈ విజయయాత్ర నేటికీ కొనసాగుతోంది. పాలనాదక్షత, అంకితభావంతో దేశాభివృద్ధిలో తనదైన ముద్ర వేస్తున్న మోదీ, అంతర్జాతీయ స్థాయిలో కూడా అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

Advertisement

Read Also: YS Family: దేవుని సాక్షిగా చెబుతున్నా.. జగన్ అన్యాయం చేశాడు.. విజయమ్మ లేఖతో ఏపీ రాజకీయాల్లో పెను తుపాను

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×