E-Paper
Advertisement

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!

అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ప్రధాని మోడీ రియాక్షన్ ఇదే!
Advertisement

PM Modi On US-Iran Peace Deal: అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ఈ ఒప్పందం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు ముగింపు పలికి, ఆ ప్రాంతంలో శాంతి, స్థిరత్వాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. అంతర్జాతీయ వాణిజ్యానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలు కొనసాగేందుకు ఈ ఒప్పందం దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ

ఇరాన్-అమెరికా ఒప్పందంపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. గత కొన్ని నెలలుగా పశ్చిమాసియాలో కొనసాగిన ఘర్షణల కారణంగా అనేక దేశాలు తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొన్నాయన్నారు. ఈ సంఘర్షణల వల్ల ప్రాణనష్టం మాత్రమే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం పడిందని అన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. కేవలం తాత్కాలిక శాంతి ఒప్పందంగా కాకుండా, దీర్ఘకాలిక పరిష్కారానికి మార్గం సుగమం చేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇంకా పరిష్కారం కావాల్సిన అంశాలపై కూడా ఇరు దేశాలు సానుకూల చర్చలు కొనసాగించి, శాశ్వత ఒప్పందం దిశగా ముందుకు సాగాలని సూచించారు.

శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన

Advertisement

ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ శాంతి ఒప్పందంపై కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌ తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఒప్పందం కుదిరిందని ఆయన వెల్లడించారు. ఈ అవగాహన ప్రకారం ఇరు దేశాలు యుద్ధ చర్యలను నిలిపివేయడానికి అంగీకరించాయని చెప్పారు. ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి మార్గాన్ని తిరిగి తెరవాలని కూడా ఈ ఒప్పందంలో నిర్ణయించినట్లు ట్రంప్ వెల్లడించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచంలో పెద్ద మొత్తంలో ముడి చమురు రవాణా జరుగుతుంది. ఇటీవల నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఈ మార్గం భవిష్యత్తుపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అయితే తాజా ఒప్పందంతో ఆ భయాలు తగ్గినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

తగ్గుముఖం పట్టిన చమురు ధరలు

శాంతి ఒప్పందం ప్రభావం అంతర్జాతీయ చమురు మార్కెట్లపై కూడా కనిపించింది. యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధరలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ప్రపంచ మార్కెట్లలో స్థిరత్వం నెలకొనే అవకాశాలు పెరిగాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. భారత్  లాంటి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు కూడా ఈ పరిణామం సానుకూలంగా మారే అవకాశం ఉంది. చమురు ధరలు తగ్గితే దిగుమతి వ్యయం తగ్గడంతో పాటు ద్రవ్యోల్బణంపై కూడా కొంత నియంత్రణ సాధించవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.  అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఒప్పందం ద్వారా పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంధన సరఫరా వ్యవస్థలు మరింత బలోపేతం కావాలని  ప్రపంచ దేశాలు ఆశిస్తున్నాయి.

Advertisement

Read Also: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×