E-Paper
Advertisement

BJP Politics: ఇక ఆయనే మా బాస్.. నేను పార్టీ కార్యకర్తని మాత్రమే: మోదీ

BJP Politics: ఇక ఆయనే మా బాస్.. నేను పార్టీ కార్యకర్తని మాత్రమే: మోదీ
Advertisement

BJP Politics: బీజేపీ కొత్త అధ్యక్షుడు నితిన్ నబిన్ ఇకపై మా బాస్ అని, తాను కేవలం పార్టీ కార్యకర్తని మాత్రమేనని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. బీజేపీ వారసత్వాన్ని ఆయన ముందుకు తీసుకెళ్తారన్నారు. రాబోయే రెండున్నర దశాబ్దాలు చాలా ముఖ్యమైనవిగా వర్ణించారు. అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించాల్సిన సమయమని, అది జరగాల్సి ఉందన్నారు.

బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ ఎంపిక

Advertisement

ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో కొత్త అధ్యక్షుడిగా నితిన్ నబీన్‌‌ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైన నితిన్ నబీన్‌‌కు ప్రధాని అభినందనలు తెలిపారు. బీజేపీలో సాధారణ కార్యకర్త కూడా జాతీయ అధ్యక్షుడు కాగలరని అన్నారు. పార్టీలో నిర్ణయాలు, ఎంపిక అన్నీ ప్రజాస్వామ్యయుతంగా ఉంటాయన్నారు.

కార్యకర్త కేంద్రంగా బీజేపీ సిద్ధాంతాలు ఉంటాయన్నారు. దేశ సేవ, ప్రజాసేవ లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేస్తున్నాయని అన్నారు. గతంలో అద్వానీ, వెంకయ్యనాయుడు నేతృత్వంలో పార్టీ ఘన విజయాలు సాధించిందన్నారు. అందరి కృషితోనే వరుసగా మూడుసార్లు అధికారంలోకి వచ్చేలా పార్టీ ఎదిగిందన్నారు. గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పార్టీ నిర్మాణం పటిష్టంగా ఉందన్నారు.

Advertisement

నితిన్ మా బాస్.. తాను కార్యకర్తని మాత్రమే-మోదీ

బీజేపీ కార్యకర్తను అనిపించుకోవడమే తనకు అసలై గర్వకారణంగా చెప్పారు. పార్టీలో ప్రత్యేకగా పదవులు, బాధ్యతలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ కార్యకర్త స్వయంగా బాధ్యతలు తీసుకోవాలని, పార్టీ కోసం కృషి చేయాలన్నారు. కొత్తగా వస్తున్న మార్పులను పార్టీ అంది పుచ్చుకోవాలన్నారు. అలాగే రేడియో నుంచి ఏఐ పరిజ్ఞానం వరకు అన్నింటినీ ఉపయోగించుకోవాలన్నారు.

పార్టీ బాధ్యతలను జీవనశైలిగా భావించాలన్నారు. బీజేపీకి అధ్యక్షులు మారుతారని, కానీ ఆదర్శాలు మారవని తేల్చి చెప్పారు ప్రధాని. నాయకత్వం మారుతుందని, లక్ష్యం మాత్రం మారదన్నారు. బీజేపీ చేతిలో దేశం సురక్షితంగా ఉంటుందని ప్రజలు భావిస్తున్నారని, సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు.

ALSO READ: అప్పుడు కూతురు.. ఇప్పుడు తండ్రి,  డీజీపీ ఆఫీసులో నటి రన్యారావు తండ్రి రాసలీలలు

దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతాల ప్రజలు బీజేపీతో ఉన్నారని, పార్టీలో చేరుతున్నారని చెప్పారు. యువతీ యువకులు రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలనుకునేవారు బీజేపీ ద్వారా ప్రవేశం సురక్షితమైన ఎంపికగా భావిస్తారన్నారు.  అంతకుముందు పార్టీ ఆఫీసులో నితిన్ నబిన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంపికైనట్టు ప్రకటించారు ఎన్నికల అధికారి డాక్టర్ లక్ష్మణ్.

ఆయనకు ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. జేపీ నడ్డా స్థానంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బీజేపీకి 12వ అధ్యక్షుడయ్యారు నితిన్ నబిన్. డిసెంబర్ 14న ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఆయన నియమితులయ్యారు. అంతకుముందు నబిన్.. బీహార్ ప్రభుత్వంలో న్యాయం, పట్టణాభివృద్ధి-గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. మరోవైపు నితిన్ నబిన్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడంతో పాట్నాలోని ఆ పార్టీ కార్యకర్తలు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. మిఠాయిలు పంచి బెట్టారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×