E-Paper
Advertisement

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానాయి.. మన డీఎన్‌ఏలో ఉందన్న ప్రధాని మోదీ
Advertisement

PM Modi: శతాబ్దాల నాటి గాయాలు మానిపోతున్నాయని అన్నారు ప్రధాని నరేంద్రమోదీ. ప్రస్తుతం బాధల నుంచి ఉపశమనం లభించిందన్నారు. ఈ జెండా రాముడి ఆదర్శాలను ప్రతిబింబిస్తుందని, సత్యం-ధర్మం విజయానికి ప్రతీక అని అన్నారు.పేదరికం, కష్టాలు, ఏ విధమైన వివక్షత లేని సమాజాన్ని నిర్మించడానికి ఇదొక జ్ఞాపికగా పని చేస్తుందన్నారు.

మంగళవారం అయోధ్యలోని రామ మందిర్‌లో ధ్వజరాహణ కార్యక్రమం తర్వాత కాషాయి జెండాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, 500 ఏళ్లుగా నలుగుతున్న సమస్యకు పరిష్కారమైందన్నారు. ఆలయ నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా నమస్కరిస్తున్నానని తెలిపారు.

Advertisement

రామాలయ నిర్మాణ యజ్ఞానికి ఇవాళ పూర్ణాహుతి జరిగిందని వివరించారు. ధర్మ ధ్వజం కేవలం జెండా కాదు.. భారతీయ సంస్కృతి పునర్వికాసానికి చిహ్నంగా వర్ణించారు. సంకల్పం-సఫలతకు ఈ ధ్వజం ప్రతీకని, శ్రీరాముడి సిద్ధాంతాలను ఈ జెండా ప్రపంచానికి చాటుతుందన్నారు. కర్మ, కర్తవ్యాల ప్రాముఖ్యాన్ని చెబుతుందన్నారు. కాషాయ జెండా హిందూ నాగరికత పునరుజ్జీవనాన్ని సూచిస్తుందన్నారు.

రాముడు వివక్ష చూపడని, మనం కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నామని తెలిపారు. 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయ్యే నాటికి, మనం అభివృద్ధి చెందిన దేశంగా నిర్ధారించుకోవాలన్నారు. రామాలయానికి వచ్చినప్పుడు ప్రతి పౌరుడు సప్త మండపాన్ని సందర్శించాలని కోరారు.

Advertisement

ఆ మండపాలు విశ్వాసం-స్నేహం-విధి-సామాజిక సామరస్యం యొక్క విలువలను బలోపేతం చేస్తాయని వివరించారు. రాముడు భావోద్వేగాల ద్వారా ఐక్యమవుతాడని, విభజన ద్వారా కాదన్నారు. ఒక వ్యక్తి పురుషోత్తముడిగా ఎలా ఎదిగాడో అనేది అయోధ్య చెబుతుంద్నారు. రాముడు కులం చూడడని, కేవలం భక్తి మాత్రమే చూస్తాడని మనసులోని మాట బయటపెట్టారు.

ధర్మధ్వజంపై కోవిదార్‌ వృక్షం ఇతిహాసాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. అబద్ధంపై సత్యం సాధించిన అంతిమ విజయానికి నిదర్శనంగా పవిత్ర జెండా నిలుస్తుందన్నారు.  భారత్‌లో ప్రతి ఇళ్లు, వ్యక్తుల మనసులో రాముడు ఉన్నాడని బయటపెట్టారు. ప్రజాస్వామ్యానికి భారత్‌ పుట్టినిల్లని, మన డీఎన్‌ఏలో ఉందన్నారు.

శతాబ్దాల కిందట ప్రజాస్వామ్య విధానం ఉందన్నారు. తమిళనాడులోని ఉత్తర మేరూర్‌ శాసనం ప్రజాస్వామ్యం గురించి చెబుతోందని, రాబోయే కాలమంతా భారత్‌ తన శక్తిని ప్రపంచానికి చాటాలన్నారు. ఇవాళ వేడుక అయోధ్య చరిత్రలో ఒక యుగంలా అభివర్ణించారు. వర్తమానంపై దృష్టి పెట్టడం భవిష్యత్ తరాలకు హాని కలిగిస్తుందన్నారు.

ప్రస్తుతం వర్తమానం-భవిష్యత్తు రెండింటి గురించి ఆలోచించాలన్నారు. ఈ దేశం మనకంటే ముందే ఉందన్నారు. మన తర్వాత కూడా చాలా కాలం కొనసాగుతుందన్నారు. రాముడి నుండి నేర్చుకోవాలని, ఆయన స్వభావాన్ని అర్థం చేసుకోవాలన్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో రామరాజ్యం ఉదయించిందన్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×